వార్తల్లో అలహాబాద్ హైకోర్టు జడ్జి.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకు సంచలనం?

ఇదే.. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Update: 2024-12-10 05:20 GMT

సూటిగా చెప్పాల్సిన మాటల్ని కొన్నిసార్లు సూటిగా.. సుత్తి లేకుండా చెప్పేయాలి. అలా చెప్పిన మాటల్ని విన్నంతనే కాస్తంత భిన్నంగా అనిపించినప్పటికీ.. కొట్టొచ్చినట్లుగా కనిపించే వాస్తవం ఆలోచించేలా చేయటమే కాదు.. మరికొందరు ఆ తీరులో ఆలోచించాల్సిన అవసరం చెప్పకనే చెప్పేసినట్లు అవుతుంది. ఇదే.. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

అలహాబాద్ హైకోర్టు లైబ్రరీ హాల్లో విశ్వ హిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి పౌరస్మ్రతి అంశంపై మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీశాయి. ఆయన చేసిన వ్యాఖ్యల్లో చాలావరకు ఇప్పటివరకు ప్రస్తావించనివే ఉన్నట్లు చెబుతున్నారు. కీలక స్థానంలో ఉన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడెందుకు అంత సంచలనం అన్నది మాటల్ని యధాతధంగా చెప్పేస్తే..

- దేశంలో మెజార్టీ ప్రజల ఇష్టానుసారం పాలన కొనసాగాలని చెప్పేందుకు ఏ మాత్రం సంకోచించను.

- మెజార్టీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలి.

- కుటుంబంగా చూసినా.. సమాజంగా చూసినా.. మెజార్టీ ప్రజల సంక్షేమం.. సంతోషమే ముఖ్యం.

- మా పర్సనల్ లా వీటిని అంగీకరిస్తోందని.. అలాంటివి ఏ మాత్రం అమోదనీయం కాదు.

- మన శాస్త్రాలు.. వేదాల్లో స్త్రీని శక్తిస్వరూపిణిగా భావించారు.

- నలుగురు భార్యల్ని కలిగి ఉంటాను. హలాలా.. త్రిపుల్ తలాఖ్ ను పాటిస్తానంటే కదురదు.

- సామరస్యం.. లింగ సమానత.. సామ్యవాదమే ఉమ్మడి పౌరస్మ్రతి ధ్యేయం.

- అదే సమయంలో వీహెచ్ పీ.. ఆర్ఎస్ఎస్.. హిందూయిజాలను ఉమ్మడి పౌరస్మ్రతి ప్రోత్సహించదు.

Tags:    

Similar News