“తప్పుడు సమాచారంతో మాట్లాడుతుంటే”... అల్లు అరవింద్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి?
అవును... తాజాగా జరిగిన పరిణామాలపై అల్లు అర్జున్ స్పందించగా.. అనంతరం అల్లు అరవింద్ మీడియాను అడ్రస్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో.. సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటన, అనంతర పరిణామాలు, అల్లు అర్జున్ వ్యవహార శైలి మొదలైన విషయాలపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చి.. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని.. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అన్నారు. అనంతరం అల్లు అరవింద్ స్పందించారు.
అవును... తాజాగా జరిగిన పరిణామాలపై అల్లు అర్జున్ స్పందించగా.. అనంతరం అల్లు అరవింద్ మీడియాను అడ్రస్ చేశారు. ఈ సందర్భంగా స్పందిస్తూ... "ఆల్ ఇండియా స్థాయిలో కలెక్షన్స్ లో రికార్డులు బద్దలు కొట్టిన చిత్రం.. అందులో ఆయన కష్టం.. ఇవన్నీ చేసిన ఓ సినిమాకి అతను వెళ్లి మొదటి షోలో ప్రజల రియాక్షన్ ను చూసుకునే అదృష్టం లేకపోయింది.. ఓ దురధృష్ట ఘటన జరిగింది"!
"ఇంత పెద్ద సినిమా తీసిన అతను గత రెండు వారాలుగా గార్డెన్ లో ఓ మూల కూర్చుని ఉంటున్నాడు. దీంతో... దేశమంతా నీ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటుంటే.. నువ్వు మాత్రం ఇలా కూర్చుని ఉంటున్నావు అని నేను అంటే.. ఓ దురదృష్ట ఘటన జరిగింది.. తర్వాత ఎప్పుడైనా వెళ్తాలే అని.. ఇది సమయం కాదని అన్నాడు!"
"ఇది ఒక సినిమాతోనో, ఒక రోజులోనో వచ్చింది కాదు.. అతడు 22 సంవత్సరాలు కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు.. ఇది అతడు డెవలప్ చేసుకోవడమే కాదు.. ఇది మూడు తరాల నుంచి వస్తుంది.. మీము ఎలాంటి మనుషులం అనేది మీకు తెలుసు.. మీరు చూస్తున్నారు.. అలాంటిది తప్పుడు సమాచారంతో ఒకరు మాట్లాడుతుంటే.. అది బాదేసింది!"
"దీనిపై వివరణ ఇవ్వాలని అతను అన్నప్పుడు.. ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు. ప్రజలు ఆదరిస్తే, ఆ అభిమానంతో పైకి వచ్చిన కుటుంబం మాది.. ఆ అభిమానాన్ని అర్ధం చేసుకుని, ఇలానే కంటిన్యూ చేయమని కోరుతున్నాను. మిగిలిన విషయాలు మరోసారి మాట్లాడతాను!" అని అన్నారు.
ఈ క్రమంలో ప్రధానంగా... "తప్పుడు సమాచారంతో ఒకరు మాట్లాడుతుంటే.. అది బాదేసింది" అని అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనే చర్చ మొదలైందని అంటున్నారు!
కాగా... తనకున్న సమాచారం ప్రకరాం థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందని.. ఆ ఘటనలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని.. మహిళ మృతి చెందిందని పక్కనున్న వాళ్లు హీరోకు చెప్తే... "అయితే.. మన సినిమా హిట్ అయినట్లే" అని హీరో వారితో అన్నారంటూ అసెంబ్లీ అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే!