చంచలగూడ జైల్లో అల్లు అర్జున్ నెం.7697

తొక్కిసలాట కేసులో అరెస్టు అయి.. రిమాండ్ కు వెళ్లిన ప్రముఖ హీరో అల్లు అర్జున్ కు జైల్లో జైలు అధికారులు నెంబరును కేటాయించారు.

Update: 2024-12-13 23:45 GMT

తొక్కిసలాట కేసులో అరెస్టు అయి.. రిమాండ్ కు వెళ్లిన ప్రముఖ హీరో అల్లు అర్జున్ కు జైల్లో జైలు అధికారులు నెంబరును కేటాయించారు. నేరారోపణలతో జైలుకు వచ్చిన ఏ నిందితుడికైనా సరే.. ఒక నెంబరును కేటాయిస్తారు. తాజా ఉదంతంలో అల్లు అర్జున్ అండర్ ట్రయల్ ఖైదీ (యూటీ) కావటంతో ఆయనకు యూటీ నెంబరును కేటాయించారు. వరుస క్రమంలో కేటాయించే ఈ నెంబరు ఎంతన్న దానిపై ఆసక్తి నెలకొంది.

అయితే.. అల్లు అర్జున్ కు కేటాయించిన యూటీ నెంబరును అధికారులు వెల్లడించేందకు ఆసక్తి చూపలేదు. అయితే.. ఒక ప్రముఖ మీడియా సంస్థ మాత్రం ఎట్టకేలాకు దాన్ని ఛేదించింది. అల్లు అర్జున్ కు చంచలగూడ జైలు అధికారులు కేటాయించిన యూటీ నెంబరును ప్రముఖంగా ప్రచురించింది. జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ కు ప్రత్యేక వస్త్రాలు ఇస్తారా? అన్న సందేహం పలువురు వ్యక్తం చేస్తున్నారు. కానీ.. అలాంటిదేమీ ఉండదు.

ఎందుకంటే.. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న వారు ఎవరైనా సాధారణ వస్త్రాల్ని ధరించుకోవటానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా తొక్కిసలాట కేసులో అరెస్టు అయిన బన్నీకి కేటాయించిన యూటీ నెంబరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News