బీఆర్ఎస్ బీజేపీ ట్రాప్ లో పడ్డ అల్లు అర్జున్ ?
అల్లు అర్జున్ ఇష్యూలో రాజకీయం ప్రవేశించింది అని అంటున్నారు. ఈ వ్యవహారాన్ని బీజేపీ బీఆర్ఎస్ ఎంత పెద్దదిగా చేస్తే అంత అల్లు అర్జున్ కే నష్టం అన్నది ఆయన గ్రహించలేకపోతున్నారు అని అంటున్నారు.
సినిమా రాజకీయం రెండూ ప్రజలతో సంబంధాలు ఉన్న రంగాలే. జనాలు వెండి తెర కథానాయకులను, అలాగే రాజకీయ నాయకులను ఇద్దరికీ ఆరాధిస్తారు. ఈ రెండు రంగాలలో ఉన్న వారి మధ్య ఎపుడూ క్లాష్ రాకూడదు. వచ్చిందా ఇబ్బందులే వస్తాయి. సినిమా రంగం అనేది అద్దాల మేడ లాంటిది.
అందులోనే సినీ ప్రపంచం ఉంటుంది. బయట నుంచి చూస్తే అందంగా ఉంటుంది కానీ చిన్న రాయి దెబ్బ తగిలితే చాలు అద్దాలమేడ ద్వంశం అవుతుంది. అందుకే సినీ ప్రపంచం ఎప్పటికప్పుడు జాగ్రత్తగానే ఉంటుంది. అత్యంత సున్నితమైన రంగంగా కూడా సినీ పరిశ్రమను చెప్పుకోవాలి. అయితే కొన్ని సార్లు వివాదాలు వస్తూంటాయి. వాటిని వాటిని సరైన తీరులో అధిగమించకపోతే ఇక్కట్ల పాలు అవడం కూడా జరుగుతుంది.
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ అలాంటి వివాదాలతోనే ఉన్నారు. ఆయన సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఇక బాలుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. దాంతో ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ ఏ 11 గా పేర్కొంటూ పోలేసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఆ తరువాత నుంచి ఈ కేసులో రాజకీయం ప్రవేశించింది. అల్లు అర్జున్ ని కావాలని ఇరికించే ప్రయత్నం చేశారు అని తెలంగాణాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ అలాగే కేంద్రంలో అధికారంలో ఉంటూ తెలంగాణాలో పొలిటికల్ స్పేస్ కోసం చూస్తున్న బీజేపీ రెండూ అధికార కాంగ్రెస్ ని తప్పు పట్టాయి. అంతే కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా కేటీఆర్ హరీష్ రావు నుంచి బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీకి చెందిన బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అంతా విమర్శలు ఎక్కు పెట్టారు
ఢిల్లీలోని బీజేపీ కీలక నేతలు కూడా అల్లు అర్జున్ కి మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. దాంతో ఈ మొత్తం వ్యవహారం కాస్తా రేవంత్ రెడ్డి వర్సెస్ విపక్షాలు అన్నట్లుగా మారిపోయింది. ఈ నేపధ్యంలో తన మీద విమర్శలు చేస్తున్న విపక్షాలను కట్టడి చేయడానికి అసెంబ్లీలో వాస్తవాలు ఈ కేసులో ఏమిటి అన్నది వివరించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఆయన ఈ సందర్భంగా డిటైల్డ్ గా అన్నీ వివరించారు. అయితే ఆయన అసెంబ్లీలో ప్రసంగం చేసిన తరువాత వెంటనే కౌంటర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అల్లు అర్జున్ తాను చెప్పాల్సింది చెప్పారు. తన మీద వ్యక్తిత్వ హననం జరుగుతోంది అని అన్నారు. తన తప్పు లేదని అంతా యాక్సిడెంటల్ గా సాగింది అని ఆయన సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. దీంతో మొత్తం సీన్ మారిపోయింది.
అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి మీద ఇండైరెక్ట్ గా అయినా కామెంట్స్ చేయడం వల్ల అల్లు అర్జున్ మరింత ఇరకాటంలో పడ్డారని ఆ తరువాత వరస సంఘటనలు తెలియచేశాయి. వెంటనే పోలీసు అధికారులు రంగంలోకి వచ్చారు. అదే విధంగా సంధ్యా ధియేటర్ లో అసలు ఏమి జరిగింది అన్న దాని మీద వీడియో ఫుటేజ్ ని విడుదల చేశారు. మొత్తం పిక్చర్ ని జనాలకు తెలియచేశారు.
దాంతో అల్లు అర్జున్ పూర్తిగా డిఫెన్స్ లో పడినట్లు అయింది అని అంటున్నారు. ఆయన అనవసరంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారని కూడా అంటున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో రాజకీయ పాలు ఎక్కువగా ఉంది. ఆయన విపక్షాల మీద విమర్శలు చేశారు. మధ్యలో అల్లు అర్జున్ ప్రసక్తి ఉన్నా ఆయన అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టారని అంటున్నారు. అలా ఆయన వ్యవహారాన్ని కెలికి కొత్త చిక్కులు తెచ్చుకున్నారని అంటున్నారు.
ప్రెస్ మీట్ తరువాతనే ఇష్యూ మరింత జఠిలంగా మారిందని కూడా అంటున్నారు లేకపోతే బెయిల్ తెచ్చుకున్న తరువాత అల్లు అర్జున్ సైలెంట్ గా ఉంటే ఈ వ్యవహారం ఏదో కాటికి ఒక కొలిక్కి వచ్చేదని కూడా అంటున్నారు. మరో వైపు చూస్తే బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ కోణంలో నుంచి విమర్శలు చేస్తూ వస్తున్నారు అని అంటున్నారు.
మరి తెలిసో తెలియకో ఆ ట్రాప్ లోకి ఆయన చిక్కుకున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటి అంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రసంగం తరువాత కౌంటర్లు ఏవో విపక్షాలు ఇచ్చేవి. మధ్యలో రీల్ హీరో అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చి మాట్లాడడం వల్లనే చాలా దూరం వ్యవహారం వెళ్ళిపోయింది అని అంటున్నారు.
అప్పటిదాకా స్మూత్ గా ఉన్న వ్యవహారమే మారిందని అంటున్నారు దీనికి అంతటికీ ఒకే ఒక్క ప్రెస్ మీట్ కారణం అని అంటున్నారు. సీఎం స్థాయి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడిన తరువాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఉండాల్సింది కాదని అంటున్నారు.
అల్లు అర్జున్ ఇష్యూలో రాజకీయం ప్రవేశించింది అని అంటున్నారు. ఈ వ్యవహారాన్ని బీజేపీ బీఆర్ఎస్ ఎంత పెద్దదిగా చేస్తే అంత అల్లు అర్జున్ కే నష్టం అన్నది ఆయన గ్రహించలేకపోతున్నారు అని అంటున్నారు. ముందే చెప్పినట్లుగా అద్దాల మేడలో ఉండే సినీ లోకానికి చిన్న రాయి దెబ్బ కూడా ఇబ్బందిగానే ఉంటుంది. దాంతో అల్లు అర్జున్ చేసిన ఆ పని వల్లనే ఇదంతా జరిగిందా అన్నది కూడా చర్చకు వస్తోంది.
విపక్షాల సమర్ధింపు మాటలు వారి స్టేట్మెంట్స్ ఈ కేసులో అల్లు అర్జున్ కి హెల్ప్ ఏ మేరకు చేస్తాయో తెలియదు కానీ డ్యామేజ్ అయితే ఆయనకే జరుగుతోంది అని అంటున్నారు. ఇక పోలీసు విడుదల చేసిన వీడియోతో అల్లు అర్జున్ పరపతినే దెబ్బ తింది అని అంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టకపోతే ఇదంతా వచ్చేది కాదని అంటున్నారు
హీరోలు రాజకీయాల్లోకి ప్రభావితం కారు కానీ అవి వచ్చి వారిని టచ్ చేసినా ఇబ్బంది అవుతుంది అన్నది అల్లు అర్జున్ ఎపిసోడ్ రుజువు చేస్తోంది. మొత్తానికి జైలుకు వెళ్లారు అన్న సానుభూతి అల్లు అర్జున్ కి పూర్తిగా పోగా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారు అన్నది వీడియో రిలీజ్ ద్వారా బయటకు వచ్చిందని అంటున్నారు. సో అల్లు అర్జున్ విపక్షాల విపక్ష పొలిటికల్ ట్రాప్ లో చిక్కుకున్నారు అని అంటున్నారు అంతా.