ముగిసిన 'పుష్ప' విచారణ... 03:30 గంటలు - 20 ప్రశ్నలు!

‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-12-24 09:27 GMT

‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. పోలీసులు తనకు ఇచ్చిన నోటీసుల మేరకు అల్లు అర్జున్ ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి అల్లు అర్జున్ బయలుదేరి వెళ్లారు.

అవును... సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... అల్లు అర్జున్ పోలీసు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో విచారణకు హాజరుకాగా.. సుమారూ 3:30 గంటల పాటు ఈ విచారణ జరిగింది! ఈ సమయంలో దాదాపు 20 ప్రశ్నలు, మరో 30 అదనపు ప్రశ్నలు అల్లు అర్జున్ పై పోలీసులు సంధించారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా విచారణలో అల్లు అర్జున్ తో పాటు అతని తరుపు న్యాయవాది పాల్గొనగా.. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఏసీపీ రమేష్, సీఐ రాజు నాయక్ లు విచారించారు! ప్రధానంగా.. అల్లు అర్జున్ బెయిల్ పై వచ్చిన తర్వాత ఇటీవల పెట్టిన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖలపైనే కీలక ప్రశ్నలు సంధించినట్లు చెబుతున్నారు.

దీనికోసం... ఇటీవల హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విడుదల చేసిన వీడియో ను ప్రదర్శిస్తూ.. ఇటీవల మీడియా ముందు తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్థావిస్తూ.. విచారణ సాగిందని అంటున్నారు. అయితే... అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు అదే కీలకం కాబోతుందని అంటున్నారు.

ప్రధానంగా.. తొక్కిసలాటలో రేవతి చనిపోయిందనే విషయం మీకు తెలుసు కదా..?.. తర్వాత రోజు వరకూ తెలియదని మీడియాకు ఎందుకు చెప్పారు..?.. థియేటర్ లో బెనిఫిట్ షోకి రావడానికి అనుమతి ఉందని మీకు ఎవరు చెప్పారు..?.. ఆ కాపీ మీరు తీసుకున్నారా..? మొదలైన ప్రశ్నలకు అల్లు అర్జున్ సైలంట్ గా ఉన్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.

మరోపక్క అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ వద్దకు సీన్ రీ కనస్ట్రక్షన్ నిమిత్తం పోలీసులు తీసుకెళ్లనున్నారని.. ఈ మేరకు ఇప్పటికే సంధ్య థియేటర్ వద్ద భారీగా పోలీసులు మొహరించారని.. కథనాలొచ్చాయి. అయితే ఈ రోజుకు అలాంటిది ఏమీ లేదని తెలుస్తోంది. దీంతో.. అల్లు అర్జున్ తన నివాసానికి బయలుదేరి వెళ్లిపోయారని తెలుస్తోంది.!

అయితే... ఇక్కడితో విచారణ పూర్తైందా.. కొనసాగింపు ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది!

Tags:    

Similar News