అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ రియాక్షన్... పోలీసులపై కామెంట్స్ వైరల్!
ఈ సమయంలో అల్లు అర్జున్ నివాసం వద్దకు వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో.. పోలీసుల తీరుపై బన్నీ అసహనం వ్యక్తం చేశారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఈ సమయంలో చిక్కడపల్లి స్టేషన్ కు తరలించారు. ఈ సమయంలో అల్లు అర్జున్ నివాసం వద్దకు వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో.. పోలీసుల తీరుపై బన్నీ అసహనం వ్యక్తం చేశారు.
అవును.. డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు! ఇక ఈ ఘటనపై మృతురాలి భర్త భాస్కర్ పోలీసులు ఫిర్యాదు చేయగా.. బీ.ఎన్.ఎస్.105, 118 (1) సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
దీనికి సంబంధించి నిందితులుగా ఉన్న సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని, అల్లు అర్జున్ సెక్యూరిటీ స్టాఫ్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోగా.. తాజాగా అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు! ఈ సమయంలో తనకోసం వచ్చిన పోలీసులపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఈ సందర్భంగా... దుస్తులు మార్చుకునే సమయం కూడా ఇవ్వడం లేదంటూ అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పోలీసులు నేరుగా ఇంట్లోకి రావడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది టూమచ్ అంటూ అల్లు అర్జున్ స్పందించారు. ఇది మంచి విషయం కాదని పోలీసులతో పేర్కొన్నారు.
"బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు.. సర్ నన్ను తీసుకెళ్లడం తప్పు లేదు.. మీరు చెయ్యడం తప్పులేదు.. కానీ.. మరీ బెడ్ రూమ్ బయటకు వచ్చి, బెడ్ రూమ్ దగ్గర నుంచి తీసుకెళ్లడం కచ్చితంగా మంచి విషయం కాదు.. టుమచ్.." అని అల్లు అర్జున్ పోలీసుల వద్ద అసహనం వ్యక్తం చేశారు!
మరోపక్క చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో ఆయన భార్య స్నేహరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులు ఇంటికి రావడంతో స్నేహారెడ్డి టెన్షన్ పడ్డారు. ఈ సమయంలో భార్య భుజం తట్టి బన్నీ ధైర్యం చెప్పారు!