నీతా అంబానీ తన కొడుకు కోడళ్ల చేతులను నల్లదారం ఎందుకు కడుతుంది ?
అంబానీ కుటుంబానికి దుస్తులు, ఆభరణాలపై లక్షల రూపాయలు ఖర్చు చేయడం పెద్ద విషయం కాదు.;

అంబానీ కుటుంబం ఎలాంటి లగ్జరీ జీవితాన్ని గడుపుతుందో అందరికీ తెలిసిందే. కొన్ని నెలల క్రితం అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లిని ఔరా అనే విధంగా ప్రీ-వెడ్డింగ్ వేడుకలను ప్రపంచమంతా చూసింది. ఈ వేడుకల్లో మీరు ఒక విషయం గమనించినట్లయితే.. ప్రతి కార్యక్రమంలో నీతా అంబానీ, ముఖేష్ అంబానీతో సహా వారి కోడళ్లు, కుమారులు సైతం చేతులకు నల్ల దారం ధరించి కనిపించారు. కానీ వారు అలా ఎందుకు ధరిస్తారు? అంబానీ కుటుంబానికి, ఈ నల్ల దారానికి ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అంబానీ కుటుంబానికి దుస్తులు, ఆభరణాలపై లక్షల రూపాయలు ఖర్చు చేయడం పెద్ద విషయం కాదు. తమ ఇంట్లో జరిగిన ప్రతి వేడుక కోసం వారు ప్రత్యేకమైన దుస్తులు, ఆభరణాలను ధరించారు. ప్రతిసారీ వారి కొత్త లుక్, సరికొత్త యాక్సెసరీలు అందరినీ ఆకట్టుకున్నాయి. కానీ ఒక విషయం మాత్రం మారలేదు, అది అంబానీ కుటుంబ సభ్యుల చేతులకు కట్టిన నల్ల దారం.
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, అనంత్ అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్ లేదా ఇషా అంబానీ.. వీరందరి చేతులకు మీరు తప్పకుండా నల్ల దారాన్ని చూడవచ్చు. సాధారణంగా నల్ల దారాన్ని దిష్టి తగలకుండా ఉండటానికి ధరిస్తారు. కొందరు దీనిని 24 గంటలు తమ చేతికి ఉంచుకుంటారు.
నల్ల దారం ధరించడం వల్ల శని దోషం తొలగిపోతుందని, దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందని, విజయం కూడా సిద్ధిస్తుందని నమ్ముతారు. అందుకే నీతా అంబానీ ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లినా ఆమె చేతికి తప్పకుండా నల్ల దారం కనిపిస్తుంది. ఇంట్లో ఏదైనా వేడుక జరిగినా వారి కుటుంబ సభ్యులందరూ నల్ల దారం ధరించి కనిపిస్తారు.
వారి కుమార్తెలు, కోడళ్లు మరియు కుమారులు సాంప్రదాయ లేదా వెస్ట్రన్ దుస్తులు ఏవి ధరించినా, వారి చేతులకు మాత్రం నల్ల దారం తప్పకుండా ఉంటుంది. అందుకే అంబానీ కుటుంబ చిన్న కోడలు రాధికా మర్చంట్ కూడా తన ప్రతి వేడుకలో దీనిని ధరించి కనిపించింది.