పారిస్ లో అంబానీ ఫ్యామిలీతో పాక్ మహిళ... ఫోటోలు వైరల్!
ఈ క్రమంలో ఇటీవల పారిస్ లోని డిస్నీల్యాండ్ లో కుమార్తె ఇషాతో కలిసి కనిపించారు
సుమారు మూడు నాలుగు నెలలుగా కుమారుడి వివాహానికి సంబంధించిన సంబరాల్లో బిజీగా గడిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రస్తుతం కుటుంబ సమేతంగా.. ఒలింపిక్స్ కోసం పారిస్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల పారిస్ లోని డిస్నీల్యాండ్ లో కుమార్తె ఇషాతో కలిసి కనిపించారు. ఈ నేపథ్యంలో ఓ మహిళతో ముఖేష్ ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి.
అవును... ప్రస్తుతం ఒలింపిక్స్ కోసం ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఫ్రాన్స్ లో ఉంది. ఈ నేపథ్యంలో అంబానీ ఇటీవల పారిస్ లోని డిస్నీల్యాండ్ లో కుమార్తె ఇషాతో కనిపించారు. ఇదే సమయంలో ఆయన ఓ మహిళతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా... ఆ ఫోటోకు సంబంధించిన చర్చ భారత్ లోనే కాదు.. పాక్ లో కూడా వైరల్ గా మారడం గమనార్హం.
అందుకు కారణం.. ఆ ఫోటోలో ముఖేష్ అంబానీతో ఉన్న మహిళ పాకిస్థాన్ కు చెందిన షర్మిలా ఫరూఖీ కావడమే. దీంతో... ఎవరీ షర్మిలా ఫరూఖీ, ఆమెకు ముఖేష్ అంబానీకి ఉన్న సంబంధం ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది. మరోపక్క ఈ ఫోటోను షర్మిళా ఫారూఖీనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో పారిస్ లోని డిస్నీల్యాండ్ లోనిదని వెల్లడించారు.
ఎవరీ షర్మిలా ఫరూఖీ?:
పాకిస్థాన్ కు చెందిన రాజకీయ నాయకురాలు షర్మిలా సాహిబా ఫరూఖీ... బిలావల్ - భుట్టో జర్దార్తీకి చెందిన పాలిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)లో ఉన్నారు. ఆమె సింధ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమె తాత ఎన్.ఎం. ఉకైలీ... గతంలో పాకిస్థాన్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. మరోపక్క పాక్ ప్రెసిడెంట్ అసిఫ్ అలీ జర్దారీకి అత్యంత సన్నిహితుడైన సల్మాన్ ఫరూకీ కి ఈమె మేనకోడలు అవుతారు!
ఇక 1978 జనవరి 25న పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో జన్మించిన షర్మిల... ఎంబీఏ పూర్తి చేశారు. ఇదే సమయంలో... న్యాయశాస్త్రంలోనూ పీహెచ్డీ పూర్తి చేశారు. ఇక ఈమె 2015లో హషం రియాజ్ షేక్ ను వివాహం చేసుకున్నారు. పాక్ లో జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లిల్లలో వీరిది ఒకటి. ఈమెకు ఆరెళ్ల కొడుకు ఉన్నాడు.