గోవా సీఎం వపన్ కల్యాణ్? : అంబటి రియాక్షన్
సోషల్ మీడయాలో యాక్టివ్ గా ఉండే మాజీ మంత్రి అంబటి రాంబాబు డిప్యూటీ సీఎం కామెంట్స్ కు కౌంటర్ గా ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఏంటి టైటిల్ చూసి షాక్ అయ్యారా? ఏపీ డిప్యటీ సీఎం పవన్ కల్యాణ్ గోవా సీఎం ఎలా అయ్యారని తికమక పడుతున్నారా? అదంతా వైసీపీ రియాక్షన్ అండీ బాబు.. జగన్ జర్మనీ వెళ్లాలంటూ జనసేనాని పవన్ పేల్చిన మాటల తూటాలు ప్రతిపక్షం వైసీపీని తీవ్రంగా తాకాయనిపిస్తోంది. పవన్ కామెంట్స్ చేసిన వెంటనే రంగంలోకి దిగిపోయింది వైసీపీ. సోషల్ మీడయాలో యాక్టివ్ గా ఉండే మాజీ మంత్రి అంబటి రాంబాబు డిప్యూటీ సీఎం కామెంట్స్ కు కౌంటర్ గా ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ప్రతిపక్ష హోదా కావాంటే జగన్ పార్టీ జర్మనీ వెళ్లడం ఒక్కటేనంటూ చమత్కరించి ఆ పార్టీని ఉలికిపాటుకు గురిచేశారు పవన్. ఆయన అలా మాట్లాడి కారెక్కారో లేదో.. టీవీ చానళ్లు, సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంల్లో సేనాని కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయని వైసీపీ వెంటనే రంగంలోకి దిగింది. మా పార్టీని, అధినేతను అంతమాట అంటారా? అంటూ పవన్ పై రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది.
ఏపీలో 21 సీట్లు గెలుచుకున్న జనసేనాని పవన్ కూటమిలో రెండో పెద్ద పార్టీ నేతగా డిప్యూటీ సీఎం హోదా అనుభవిస్తున్నారు. అయితే ఆయనకు వచ్చిన సీట్లతో సీఎం అవ్వడం కష్టమని అటాక్ చేస్తున్న వైసీసీ.. పవన్ సీఎం అవ్వాలంటే గోవా వెళ్లాలని సలహా ఇచ్చింది. ఇలా పవన్ పై ప్రతీకారం తీర్చుకున్న వైసీపీ తగ్గేదేలే అంటూ సంకేతాలిచ్చింది. మాటకు మాట అన్నట్లు అంబటి చేసిన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే ఈ ఫన్నీ కామెంట్స్ ఏపీ రాజకీయ రంగ స్థలంపై కొత్తగా అనిపిస్తున్నాయి. గతంలో పరుష పదజాలం.. తిట్ల దండకం.. సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుమ సాగే సభలో ఇప్పుడు అలాంటి సీన్స్ కనిపించడం లేదు. ప్రతిపక్షం సభను బహిష్కరించడం వల్ల అధికార పక్షం మాత్రమే అసెంబ్లీలో కనిపిస్తోంది. ఇక సభ వెలుపల అక్కడక్కడా మాటలయుద్ధం కనిపిస్తున్నా, గతంలో ఉన్నంత రేంజ్ లేదని అంటున్నారు. ఇక పరుష వ్యాఖ్యల స్థానంలో ఫన్నీ కామెంట్స్ ఇటీవల ఎక్కువయ్యాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని పరామర్శించే సమయంలో కూడా వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబు అందంపై కామెంట్లు చేశారు.
ఆయన వెళ్లిన సందర్భం ఏదైనా.. ఫన్నీగా కాసేపు మాట్లాడటం రాజకీయంగా ఆసక్తిరేపింది. దీనిపై విమర్శలు, ప్రతివిమర్శలు ఎలా ఉన్నా అందచందాలకు కూడా రాజకీయాల్లో స్థానం ఉంటుందా? అనే చర్చ జరిగింది. ఇక ఇప్పుడు జగన్ జర్మనీ వెళ్లిపోవాలని పవన్ సలహా ఇస్తే.. పవనే గోవా సీఎం అవుతారంటూ ఎదురుదాడి చేసిన వైసీపీ వ్యంగ్యాన్ని అంతా కొత్తగా చూస్తున్నారు. ఏదైనా ఈ పొలిటికల్ కామెడీ అందరినీ ఆకట్టుకుంటోంది.