న్యూ లుక్.. ఓల్డ్ టాస్క్... 'వకీల్ సాబ్' గా అంబటి రాంబాబు! /

అవును... మాజీ మంత్రి అంబటి రాంబాబు నల్లకోటు వేసుకుని న్యాయవాది అవతారమెత్తారు. తాను ఇచ్చిన ఫిర్యాదులపై ఏపీ హైకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు.

Update: 2025-01-06 14:16 GMT

తనకున్న పరిధి మేరకు ఉన్నంతలో కలర్ ఫుల్ దుస్తుల్లో కనిపిస్తున్న మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు.. తాజాగా లాయర్ దుస్తుల్లో కనిపించారు. నల్లకోటు వేసుకుని ఏపీ హైకోర్టులో తాను ఇచ్చిన ఫిర్యాదులపై ఇన్ పర్సన్ గా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు రియల్ వకీల్ సాబ్ లుక్ నెట్టిట హల్ చల్ మొదలుపెట్టిందని అంటున్నారు.

అవును... మాజీ మంత్రి అంబటి రాంబాబు నల్లకోటు వేసుకుని న్యాయవాది అవతారమెత్తారు. తాను ఇచ్చిన ఫిర్యాదులపై ఏపీ హైకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. గత ఏడాది నవంబర్ 19న పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఐదు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు.

అయితే తాను ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు రిజిస్టర్ చేయలేదని.. ఆ తర్వాత అవే ఫిర్యాదులు జిల్లా ఎస్పీకి ఇచ్చినా ఫలితం రాలేదని అన్నారు. ఇలా పట్టాభిపురం పోలీసులు, గుంటూరు జిల్లా పోలీసులు చట్టాన్ని పాటించకపోవడంతో గత్యంతరంలేక తాను హైకోర్టులో రిట్ ఆఫ్ మేండమస్ ను ఫైల్ చేసినట్లు తెలిపారు. అది ఈ రోజు విచారణకు వచ్చినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా... నవంబర్ 19 నుంచి జనవరి 4 వరకూ పోలీసులు తాను ఇచ్చిన ఫిర్యాదులపై ఏ కేసును రిజిస్టర్ చేయలేదని.. తనకు 3వ తేదీన ఫోన్ చేసి, కేసులు రిజిస్టర్ చేస్తున్నట్లు తెలిపారని.. ఐతే తాను ఐదు ఫిర్యాదులు చేస్తే నాలుగు కేసులు మాత్రమే రిజిస్టర్ చేశారని.. అందులో అయ్యన్న పాత్రుడిపై తాను చేసిన ఫిర్యాదులో ఆయన పేరు పెట్టకుండా.. 'అన్ నోన్ పర్సన్' అని పొందుపరిచారని అంబటి తెలిపారు.

దీంతో.. ఈ ఫిర్యాదులు, కేసుల విషయంలో పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉన్నట్లు అర్ధమవుతుందని అంబటి అన్నారు. ఇక కేసు రిజిస్టర్ చేయని ఫిర్యాదు... గతంలో జగన్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అసభ్యకరంగా పెట్టిన పోస్టులపై చేసినట్లు తెలిపారు. ఆ ఫిర్యాదును నారా లోకేష్ తో పాటు ఆయనకు సంబంధించిన వ్యక్తులపై ఇచ్చినట్లు తెలిపారు.

ఈ సమయంలో.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తరుపు ప్రాసిక్యూటర్ కు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చినట్లు అంబటి తెలిపారు. ఆ సమయంలో తన పూర్తి వాదనలు వినిపిస్తానని అన్నారు.

Tags:    

Similar News