అమెరికాలో ఉద్యోగులకు ఇది మామూలు బ్యాడ్ న్యూస్ కాదు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల దృష్టి అమెరికాపై ఉందనే చెప్పాలి. ట్రంప్ చేసే ఆలోచనలు, తీసుకోబోయే నిర్ణయాలు, అవి ప్రప్రంచ దేశాలపై చూపించబోయే ప్రభావంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ సమయంలో అక్కడి ఉద్యోగులకు ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన అనంతరం తన టీమ్ గురించి తీవ్ర కసరత్తు చేస్తున్నారనే కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వాములకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా... డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ సంయుక్త సారధులుగా వీరిని నియమించారు.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలపై వీరిద్దరి ప్రభావం కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వ వ్యవస్థలో కీలక మార్పులు తేనున్నట్లు ఇరువురు బిజినెస్ మేన్ లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సమయంలో భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగల్లో భారీగా కోతలు విధించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇటీవల ఫ్లోరియాడాలోని ట్రంప్ ఎస్టేట్ మారలాగోలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వివేక్ రామస్వామి మాట్లాడుతూ... తాను, ఎలాన్ మస్క్ కలిసి ఈ దేశాన్ని కాపాడాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే... వ్యవస్థకు భారంగా మారిన లక్షల మంది పెడరల్ బ్యూరోక్రాట్లను సామూహికంగా తొలగించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా... భారీగా పెరిగిన ఉద్యోగస్వామ్యం కారణంగా ఖర్చులు ఎక్కువ, పనులు తక్కువగా ఉంటాయని.. గత నాలుగేళ్లుగా ఇదే జరిగి, దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తోందని అన్నారు.
ఈ పరిస్థితి ఇకపై కొనసాగకూడదని స్పష్టం చేశారు. దీంతో.. త్వరలో భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ అందబోతోందని.. ఇది ఒక సంచలన విషయమని అంటున్నారు! మరి ట్రంప్ 2.0 ఇంకెన్ని సంచలనాలకు వేదిక కానుందో వేచి చూడాలి!