అమితాబ్ ఆసక్తికర పోస్ట్... ట్రంప్ – జెలెన్ స్కీ భేటీ గురించేనా?
నేషనల్ మీడియాలోనూ, ఇంటర్నేషనల్ మీడియాలోనే ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది.
శుక్రవారం వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మధ్య జరిగిన భేటీ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. నేషనల్ మీడియాలోనూ, ఇంటర్నేషనల్ మీడియాలోనే ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో అమితాబ్ బచ్చన్ పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
అవును... రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం.. దానికి బదులుగా ఉక్రెయిన్ లోని అరుదైన ఖనిజాల తవ్వకాలకు అనుమతించాలని అమెరికా ప్రతిపాదించింది. దీంతో.. జెలెన్సీ వైట్ హౌస్ కి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురి ప్రెసిడెంట్స్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.. దీంతో.. చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. వాస్తవానికి రాజకీయ అంశాలకు ఒకింత దూరంగ ఉండే ఆయన పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ సందర్భంగా... "అక్కడికి వెళ్లారు.. కానీ, తిరిగి వచ్చారు" అని పోస్టులో వ్యాఖ్యానించారు.
దీంతో... తాజాగా శ్వేతసౌధ్యంలో ట్రంప్, జెలెన్ స్కీ భేటీని ఉద్దేశించి ఆయన ఈ పోస్ట్ పెట్టారని పలువురు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షుల భేటీని ఎద్దేవా చేస్తూనే ఆయన ఈ విధంగా స్పందించారని అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది మాత్రం.. అంతకు మించి ఏదైనా ఉండొచ్చు.. లేదా, సాధారణంగానే పెట్టి ఉండొచ్చని చెబుతున్నారు.
కాగా... అమెరికా – ఉక్రెయిన్ ప్రెసిడెంట్స్ మధ్య మీడియా ఎదుటే వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. అగ్రరాజ్యంతో ఖనిజాల తవ్వకం ఒప్పందం చేసుకోకుండానే జెలెన్ స్కీ వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా... ఉక్రెయిన్ ఆవేదనను వినాలని ప్రపంచ దేశాలను కోరారు.
ఇదే సమయంలో.. ఉక్రెయిన్ లోని ప్రజలు తాము ఒంటరి కాదని గుర్తించుకోవడం ముఖ్యమని.. తమ ఆలోచనలు, ఆసక్తులను ప్రతిదేశం గుర్తిస్తుందన్న ఆశాభావం ఉందని అన్నారు.