మేం అవ‌కాశాలు వెతుక్కున్నాం-వారు కార‌ణాలు వెతుక్కుంటున్నారు: ఇండియాపై షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాజాగా ఆయ‌న పీటిఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో గెలుపు ఓటముల‌పై స్పందించారు.

Update: 2024-05-27 04:04 GMT

''ప్ర‌స్తుత సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆరు ద‌శ‌లు ముగిశాయి. ఒక్క ద‌శ‌లో కూడా.. ఇండియా కూట‌మి గెలిచే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్ట మైంది. క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్కించుకునే ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. అందుకే వారు రేపు చిత్తుగా ఓడిపోయిన త‌ర్వాత‌.. ఎందుకు ఓడిపోయామ‌ని చెప్పేందుకు కార‌ణాలు వెతుక్కుంటున్నారు. ఈవీఎంల‌పై ప‌డి ఏడుస్తారు. ప్ర‌ధాని మ‌మ్మ‌ల్ని త‌ప్పుదో వ ప‌ట్టించార‌ని క‌న్నీరు పెడ‌తారు. ఇంత‌కు మించి ఇండియా కూట‌మి కి ఉన్న కార‌ణాలులేవు'' అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న పీటిఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో గెలుపు ఓటముల‌పై స్పందించారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌తి ద‌శ‌లోనూ ప్ర‌జ‌లు మోడీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ని షా చెప్పారు. అభివృద్ధి, విక‌సిత భార‌త్‌, విదేశాంగ విధానం.. పేద‌ల ప‌థ‌కాలు,.. విద్యుత్ ధ‌ర‌ల త‌గ్గింపు, సూర్య ఘ‌ర్ యోజ‌న వంటి అనేక ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని.. అందుకే ప్ర‌జ‌లు త‌మ వెంట నిలిచార‌ని చెప్పారు. ప్ర‌తి ద‌శ‌లోనూ పోలింగ్ బీజేపీ కూట‌మికి అనుకూలంగా ప‌డింద‌న్నారు. అందుకే.. మేం అధికారంలోకి వ‌చ్చాక‌.. ఇంకా ఎలాంటి మేలు చేయాల‌న్న అంశంపై అవ‌కాశాలు వెతుక్కుంటున్నామ‌ని షా వెల్ల‌డించారు. కేంద్రంలో గెలుపు ఓట‌ములు.. రెండు ప్ర‌జ‌లు ఇప్ప‌టికే నిర్ణ‌యించార‌ని చెప్పారు.

దేశంలో నక్సల్స్ సమస్యను ప్ర‌బుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. రెండుమూళ్ల‌లోనే పూర్తిగా ప‌రిష్క‌రించి.. ఆయా ప్రాంతాల‌ను అభివృద్ధి చేయ‌నున్నట్టు తెలిపారు. యావత్ దేశం నక్సల్స్ నుంచి విముక్తి పొందుతుంద‌న్నారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ సర్కార్ అధికారం చేపట్టడం వల్ల నక్సల్స్పై చర్యలు ప్రారంభమయ్యాయని, గ‌తంలో కాంగ్రెస్ పాల‌కులు మావోయిస్టుల‌ను పెంచి పోషించార‌ని విమ‌ర్శించారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌, స‌హా ఇత‌ర విప‌క్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లోనూ బీజేపీకి ప్ర‌జ‌లు మొగ్గు చూపార‌ని అన్నారు. ఎన్డీఏ భారీ మెజారిటీతో గెలుస్తుందని తెలిసి విపక్షాలు ఓటమికి సాకులు వెతుక్కుంటూ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ మతం ఆధారంగా ప్రచారం చేయలేదని, ముస్లింల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని షా చెప్పారు. ``రాజ్యాంగ‌మే మ‌త ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌ద్ద‌ని చెప్పింది. అదే కదా మేం చెబుతున్నాం. మేం రాజ్యాంగాన్ని మారుస్తామ‌ని చెప్ప‌లేదు. వారు అలా మార్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌త ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌డం అంటే.. రాజ్యాంగాన్ని అవ‌మానించిన‌ట్టు కాదా? ఇదేనా కూట‌మి నిబ‌ద్ధ‌త‌`` అని షా ప్ర‌శ్నించారు. ముస్లింల‌కు తాము అన్ని అవకాశాల‌ను క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. అయితే.. రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షించే క్ర‌మంలో వారికి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌బోమ‌న్నారు.

Tags:    

Similar News