పవన్ కోరిక మేరకు ఆయన టీమ్ లోకే అమ్రాపాలి..?

డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయపోరాటం చేసి ఓడిపోయిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి బదిలీ అయ్యారు.

Update: 2024-10-18 11:53 GMT

డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయపోరాటం చేసి ఓడిపోయిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి బదిలీ అయ్యారు. ఈ ఐఏఎస్ లలో ఒకరు అమ్రాపాలి మిగిలిన అధికారులతో కలిసి ఏపీ సచివాలయలో రిపోర్ట్ చేశారు. త్వరలో ఈమె పోస్టింగ్ పై క్లారిటీ రావొచ్చని అంటున్నారు. అయితే ఆమె పవన్ టీమ్ లోకి వెళ్లే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది!

అవును... ఐఏఎస్ అధికారి అమ్రాపాలి ఇకపై ఏపీ ప్రభుత్వంలో కొత్తగా బాధ్యతలు నిర్వహించనున్నారు. విశాఖ తన స్వస్థలంగా డీఓపీటీకి ఇచ్చిన వివరాళ్లో పేర్కొనడంతో.. ఆమెను ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆమె న్యాయపోరాటం చేశారు.. మిగతా అధికారులతో కలిసి హైకోర్టును, క్యాట్ ను ఆశ్రయించారు. అయితే... ఎక్కడా వీరికి ఊరట లభించలేదు.

వాస్తవానికి చురుకైన అధికారిణిగా అమ్రాపాలికి పేరుంది. అందువల్లే... కేంద్రం నుంచి రప్పించి మరీ ఆమెను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పోస్ట్ ఎంత ముఖ్యమైనదనేది తెలిసిన విషయమే! ఇదే సమయంలో గతంలో ప్రధాని కార్యాలయంలో దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాలను ఆమె పర్యవేక్షించేవారు!

మరోపక్క డిప్యూటీ సీఎం హోదాలో తన శాఖలను ఏరి కోరి ఎంపిక చేసుకొవడంతో పాటు.. కేరళ కేడర్ కు చెందిన అధికారి మైలవరపు కృష్ణతేజను పట్టుబట్టి మరీ తన టీమ్ లో చేర్చుకున్నారు పవన్. యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్స్ తో పనిచేయాలని పవన్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమ్రాపాలి పేరు తెరపైకి వచ్చింది!

పవన్ వద్ద ఇప్పుడున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, తాగు నీటి సరఫరా, సైన్స్ & టెక్నాలజీ, అడవులు, పర్యావరణం శాఖలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో... యంగ్ & డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న అమ్రాపాలీకి ఈ శాఖల్లోనే పోస్టింగ్ ఉండొచ్చనే ప్రచారం జరుగుతుంది. అయితే... దీనిపై పూర్తి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది!

Tags:    

Similar News