8 ఏళ్లకే అరుదైన రికార్డు నెలకొల్పిన నల్గొండ అబ్బాయి..

అలా ఓ ఎనిమిదేళ్ల బుడతడు ఒకటి కాదు రెండు కాదు దేశంలోనే అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు గుర్తు పెట్టుకుని అవలీలగా చెప్పేస్తున్నాడు.

Update: 2024-09-25 10:30 GMT

వయసుకి ప్రతిభకు ఎటువంటి సంబంధం లేదు. కొన్నిసార్లు చిన్నపిల్లలు ఎంతో ప్రతిభ కనబరిచి మనల్ని ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. ఎన్నోసార్లు వీళ్ళు తమ ప్రతిభతో సరికొత్త రికార్ డులు కొలుపుతారు. అలా ఓ ఎనిమిదేళ్ల బుడతడు ఒకటి కాదు రెండు కాదు దేశంలోనే అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు గుర్తు పెట్టుకుని అవలీలగా చెప్పేస్తున్నాడు. మరి ఇంతకీ అబ్బాయి ఎవరో తెలుసుకుందాం పదండి..

స్కూల్లో చదువుకునే టైంలో చాలామందికి ఇష్టమైన సబ్జెక్ట్ సోషల్. ఎందుకంటే ఎంత చదువుకున్నా గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా రాష్ట్రాల పేర్లు, వాటి రాజధానుల పేర్లు గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది ఒక ఎనిమిదేళ్ల కుర్రాడు తక్కువ సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లను నేర్చుకున్నాడు. దీంతో అతనికి రికార్డులో స్థానం దక్కింది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణానికి చెందిన డాక్టర్ నవీన్ కుమార్ శ్వేత దంపతుల కొడుకు మను శ్రీరామ్. స్థానికంగా ఉన్న ఓ సంస్కృతి పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న పిల్లవాడు చిన్నతనం నుంచే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ వచ్చాడు.

దేశంలో రాష్ట్రాల రాజధానుల పేర్లు చెప్పే పిల్లలు చాలామంది ఉన్నారు కానీ ఈ అబ్బాయి స్పెషాలిటీ ఏమిటంటే వీటన్నిటి పేర్లు కేవలం 15.8 సెకండ్లలో చెప్పేస్తాడు. అందుకే అతనికి దేశంలో ని వేగంగా అత్యంత తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా ప్రపంచ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఇంతకుముందు ఇటువంటి రికార్డు ఎవరూ నెలకొల్ప లేదా అన్న అనుమానం మీకు రావచ్చు.

గతంలో ఈ రికార్డ్ 19 సెకండ్ల వ్యవధిలో స్థాపించడం జరిగింది. అయితే ఎక్కడ తడబడకుండా 15.8 అవధిలో ఈ రికార్డును బ్రేక్ చేసి శ్రీరామ్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. అతి చిన్న వయసులో రికార్డు నెలకొల్పిన శ్రీరామ్ ప్రతిభను ఎందరో ప్రశంసిస్తున్నారు. అతని గెలుపు వెనక అతని తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందని.. ఇటువంటి వారు సమాజానికి సందేశాన్ని అందిస్తారని మెచ్చుకుంటున్నారు.

Tags:    

Similar News