ఇంట్రస్టింగ్... 'ఈసీ'కి ఇండిపెండెంట్ అభ్యర్థి ఆసక్తికర అభ్యర్థన!

ఈ సమయంలో తాజాగా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి.. పోలింగ్ కేంద్రాల వద్ద చెప్పులను నిషేధించాలని ఎన్నికల కమిషన్ ను కోరారు.

Update: 2024-11-18 04:00 GMT

ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ కు రకరకాల విజ్ఞప్తులు వస్తాయన్న సంగతి తెలిసిందే. వీటిలో ఎక్కువగా ప్రత్యర్థులపై ఆరోపణలు, ఫిర్యాదులే ఉంటాయని అంటారు. చర్యలు తీసుకోవాలని కోరుతుంటారు. ఈ సమయంలో తాజాగా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి.. పోలింగ్ కేంద్రాల వద్ద చెప్పులను నిషేధించాలని ఎన్నికల కమిషన్ ను కోరారు.

అవును... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందడి తీవ్ర స్థాయిలో నెలకొన్న సంగతి తెలిసిందే. పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నాయి. ఈ క్రమంలో... పరాందా అసెంబ్లీ న్నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురదాస్ శంభాజీ కాంబ్లేకు ఎన్నికల కమిషన్ "చెప్పులు" గుర్తు కేటాయించింది.

నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద అభర్థులు తమ గుర్తులన్ను ప్రదర్శించకూడదు. దీంతో... ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శంభాజీ కాంబ్లే.. ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఇందులో భాగంగా... పోలింగ్ కేంద్రాలకు అధికారులు, ఓటర్లు చెప్పులు ధరించి వస్తే.. అది నిబంధనల ఉల్లంఘనే అవుతుంది అని పేర్కొన్నారు.

అందువల్ల పోలింగ్ కేంద్రాలకు సుమారు 200 మీటర్ల పరిధిలో ఎవరూ చెప్పులు ధరించ కూడదని.. ఆ పరిధిలో వాటిని నిషేధించాలని.. అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అంతే కాకుండా... ఎన్నికల ప్రక్రియ పవిత్రతను నిలబెట్టేందుకే తాను ఈ అభ్యర్థన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ అభ్యర్థన వైరల్ గా మారింది. ఎన్నికల కోడ్ ప్రకారం ఈయన సూచన సరైందే కాబట్టి... దీనిపై ఎన్నికల కమిషన్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తిగా మారింది!

కాగా... అత్యంత ఆసక్తికరమైన మరో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి పాలించిన మహారాష్ట్ర ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి. 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో అధికార మహాయుతి కూటమి - ప్రతిపక్ష మహావికాస్ అఘాదీల మధ్య హోరాహోరీ పోటీ నెలకోంది. ఈ ఓట్ల లెక్కింపు 23న చేపట్టనున్నారు!

Tags:    

Similar News