మోదీ తిరిగొచ్చిన కొద్ది రోజులకే మత విద్వేషం? ఎక్కడంటే..?

అవి హసీనా మద్దతుదారులపైనే అని తర్వాత ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2024-09-26 16:30 GMT

ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, అమెరికా.. ఇటీవలి కాలంలో ఖలిస్థాన్ అనుకూల శక్తులు ఉనికి చాటుకున్న దేశాలివి.. బ్రిటన్ లో అయితే భారత రాయబార కార్యాలయంపై ఉన్న జాతీయ జెండాలను తొలగించారు. ఇక కెనడాలో అయితే మరీ దారుణంగా భారత వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. ఈ క్రమంలో హిందూ ఆలయాలను టార్గెట్ చేసుకున్నారు. దీనిపై భారత్ తమ నిరసనను తీవ్రంగా వ్యక్తం చేసింది. ఆపై కొంతకాలంగా లాంటి చర్యలు ఆగాయి. కానీ.. ఇటీవల బంగ్లాదేశ్ లోనూ హిందువులు లక్ష్యంగా దాడులు జరిగినట్లు కథనాలు వచ్చాయి. అవి హసీనా మద్దతుదారులపైనే అని తర్వాత ప్రభుత్వం ప్రకటించింది. ఆలయాలపైన దాడులు జరిగినట్లుగా మాత్రం అక్కడి హిందువులు చెప్పారు.

మరోసారి అక్కడ..

ప్రపంచంలో భారతీయ మూలాలున్న వారు అత్యధికంగా ఉన్న దేశాల్లో ఒకటి అమెరికా. ఇక్కడ 50 లక్షల మంది భారతీయులు ఉంటే అందులో అత్యధికులు హిందువులే. మరోవైపు భారత సంతతికే చెందిన కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్నారు. ఇటీవల మోదీ ఐక్యరాజ్య సమతి సమావేశంలో పాల్గొనేందుక అమెరికా వెళ్లివచ్చారు. కాగా, అమెరికాలోని ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు (గ్రాఫిటీ) రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పది రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. దీనికిముందు న్యూయార్క్‌ లోని బాప్స్‌ మందిరం వద్ద దుండగులు ఇదేవిధంగా ప్రవర్తించారు. ఈ ఘటనలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

సిలికాన్ వ్యాలీలో..

అమెరికా సిలికాన్ వ్యాలీగా పేరుగాంచింది కాలిఫోర్నియా. ఇక్కడ ప్రవాస భారతీయులు అధికంగా ఉంటారు. దీంతో శాక్రమెంటోలోని బాప్స్‌ శ్రీ స్వామినారాయణ మందిరం నిర్మించుకున్నారు. తాజాగా దుండగులు దీనిని టార్గెట్ చేశారు. గోడలపై విద్వేష రాతలు రాసినట్లుగా అధికారులు వెల్లడించారు. పైగా ఆలయానికి చెందిన నీటి పైపులను సైతం ధ్వంసం చేశారని సమాచారం.

శాంతి ప్రార్థనలతో ఎదుర్కొంటాం..

దుండగులు ఎంతటి చర్యకు పాల్పడినా.. సహనం, క్షమా గుణం హిందూ మతం లక్షణాలు. ఇప్పుడు వాటినే తమ సమాధానంగా చెబుతామని అంటున్నారు స్వామి నారాయణ్ మందిర్ సభ్యులు. శాంతి ప్రార్థనలతో విద్వేషాన్ని ఎదుర్కొంటామని తెలిపారు. కాగా, హిందూ వర్గానికి చెందినవారు ఆలయం వద్దకు వచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. శాంతి, ఐక్యత కోసం ప్రార్థించారు. గమనార్హం ఏమంటే శాక్రమెంటో కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు హిందూ అమెరికన్ చట్ట సభ్యుడు అమిబెరా. తమ దగ్గర మత విద్వేషానికి తావులేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు, ఇండియన్ అమెరికన్ రో ఖన్నా మాట్లాడుతూ.. విద్వేష చర్యలను అనైతికం అని అభివర్ణించారు. బాధ్యులను జవాబుదారీ చేయాలని దర్యాప్తు అధికారులకు సూచించారు.

Tags:    

Similar News