రైతులకు గుడ్ న్యూస్... ఏపీ వ్యవసాయ బడ్జెట్ లో కీలక కేటాయింపులు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Update: 2024-11-11 07:20 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా... రూ.43,402 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొచ్చారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం అచ్చెన్న వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఆంధ్ర రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని.. 62 శాతం ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారని చెప్పారు. ఇంత ముఖ్యమైన రంగాన్ని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు.

అయితే... తమ ప్రభుత్వానికి మాత్రం రైతు అభ్యున్నతే ప్రధాన లక్ష్యమని.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని.. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇదే సమయంలొ రైతులకు రాయితీపై విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు సరఫరా చేస్తామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకువెళ్తోందని అన్నారు.

వ్యవసాయ బడ్జెట్ 2024-25లో కేటాయింపులు ఇలా ఉన్నాయి...!:

నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ - రూ.14,637.03 కోట్లు

వ్యవసాయ శాఖ - రూ.8,564.37 కోట్లు

ఉచిత వ్యవసాయ విద్యుత్ - రూ.7,241.30 కోట్లు

ఉపాధి హామీ అనుసంధానం - రూ.5,150 కోట్లు

అన్నదాత సుఖీభవ - రూ.4,500 కోట్లు

ఉద్యాన శాఖ - రూ.3,469.47 కోట్లు

పశుసంవర్ధక శాఖ - రూ.1,095.71 కోట్లు

పంటల బీమా - రూ.1,023 కోట్లు

వడ్డీలేని రుణాలు - రూ.628 కోట్లు

ప్రకృతి వ్యవసాయం - రూ.422.96 కోట్లు

సబ్సిడీ విత్తనాలు - రూ.240 కోట్లు

విత్తనాల పంపిణీ - రూ.240 కోట్లు

వ్యవసాయ యాంత్రీకరణ - రూ.187.68 కోట్లు

డిజిటల్ వ్యవసాయం - రూ.44.77 కోట్లు

ఎరువుల సరఫరా - రూ.40 కోట్లు

భూసార పరీక్షలు - రూ.38.88 కోట్లు

పొలం పిలుస్తోంది - రూ.11.31 కోట్లు

వ్యవసాయ మార్కెటింగ్ - రూ.314.80 కోట్లు

సహకార శాఖ - రూ.308.26 కోట్లు

ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం - రూ.507.038 కోట్లు

ఉద్యాన విశ్వవిద్యాలయం - రూ.102.227 కోట్లు

శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం - రూ.171.72 కోట్లు

మత్స్య విశ్వవిద్యాలయం - రూ.38 కోట్లు

Tags:    

Similar News