దుమ్ములేపిన ఆంధ్రుడు... నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలివే!

ఈ క్రమంలో ఏపీలో జరిగిన పోలింగ్ కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు సీఈవో ముకేష్ కుమార్!

Update: 2024-05-15 10:35 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఎండా, కొండా చూడకుండా.. అర్ధరాత్రి అయినప్పటికీ పట్టు విడవకుండా.. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు ఆంధ్రుడు. ఏపీలో కొన్ని చోట్ల అర్ధరాత్రి 2 గంటల వరకూ కూడా పోలింగ్ నడిచిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు! ఈ క్రమంలో ఏపీలో జరిగిన పోలింగ్ కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు సీఈవో ముకేష్ కుమార్!

అవును... ఏపీ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ వివరాలు.. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా వెల్లడించారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా. ఇందులో భాగంగా రాష్ట్రం మొత్తం మీద 81.86 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపారు. ఇందులో 80.66 శాతం ఈవీఎంల ద్వారా పోలవ్వగా.. 1.2 శాతం పోస్టల్‌ బ్యాలెట్‌ తో పోలింగ్‌ నమోదైందని చెప్పారు. ఈ సందర్భంగా తుది పోలింగ్‌ శాతం వివరాలను ఆయన వెల్లడించారు.

ఇందులో భాగంగా... రాష్ట్రవ్యాప్తంగా 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక కూడా పోలింగ్‌ కొనసాగిందని చెప్పిన ముకేష్ కుమార్ మీనా... ఆఖరి పోలింగ్‌ సోమవారం రాత్రి 2 గంటలకు ముగిసిందని తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంలన్నీంటినీ 350 స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచినట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో... రీపోలింగ్‌ ఏమీ లేదని అన్నారు!

ఇదే క్రమంలో 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి సుమారు 2.09శాతం పోలింగ్ పెరిగిందని చెప్పిన మీనా... 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం నమోదైందని వివరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే... ఈ ఎన్నికల్లో అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91 శాతం, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం నమోదైనట్లు వివరించారు.

ఇక లోక్ సభ నియోజకవర్గాల విషయానికొస్తే... అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం, అత్యల్పంగా విశాఖ లోక్‌ సభలో 71.11 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ముకేష్ కుమార్ మీనా చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాలవారీగా ఫైనల్ రిపోర్ట్ తో పాటు నియోజకవర్గాల వారీగా ఓట్ల పోలింగ్ వివరాలను వెల్లడించారు.

కాగా... ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకూ జరిగిన 4 దశల పోలింగ్ లో దేశంలోనే అత్యధికంగా ఓటింగ్ ఆంధ్రప్రదేశ్ లో నమోదవ్వడం గమనార్హం!

జిల్లాల వారీగా పోలైన ఓట్ల వివరాలు..:

ఆల్లూరి - 70.20

అనకాపల్లి - 83.84

అనంతపురం - 81.08

అన్నమయ్య - 77.83

బాపట్ల - 85.15

చిత్తూరు - 87.09

కోనసీమ - 83.84

తూర్పు గోదావరి - 80.93

ఏలూరు - 83.67

గుంటూరు - 78.81

కాకినాడ - 80.31

కృష్ణా - 84.05

కర్నూల్ - 76.42

నంద్యాల - 82.09

ఎన్టీఆర్ - 79.36

పల్నాడు - 85.65

పార్వతీపురం - 77.10

ప్రకాశం - 87.09

నెల్లూరు - 79.63

సత్యసాయి - 84.63

శ్రీకాకుళం - 75.59

తిరుపతి - 78.63

విశాఖపట్నం - 70.03

విజయనగరం - 81.33

పశ్చిమ గోదావరి - 82.59

వైఎస్సార్ - 79.58

అసెంబ్లీ, లోక్‌ సభ నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ వివరాలు..:

Tags:    

Similar News