మూడు పార్టీల మీద విశాఖ జనాల మూడ్ చేంజ్...?

విశాఖను వైసీపీ రాజధానిగా చేస్తామని అంటోంది. మరి అలా కాదు అంటే విశాఖ డెవలప్మెంట్ కి టీడీపీ జనసేనల వద్ద ఆల్టర్నేషన్ విధానాలు ఏంటో చెప్పలేకపోవడం

Update: 2023-08-20 00:30 GMT

విశాఖలో మూడు పార్టీలు రాజకీయం జోరుని పెంచాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఎవరి రాజకీయం వర్కౌట్ అవుతుంది, ఎవరికి పరిస్థితి అనుకూలంగా ఉంది అన్నది చూసుకున్నపుడు మాత్రం చాలా విషయాలను గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. విశాఖలో 2019లో నాలుగు సీట్లు కోల్పోయిన వైసీపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. అదే సమయంలో విశాఖకు ప్రముఖ స్థానం ఇస్తూ అన్ని రకాలుగా జోరు చేస్తోంది.

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ని నిర్వహించిన వైసీపీ ప్రభుత్వం అనేక పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తోంది. ఐటీ పరంగా విశాఖను అభివృద్ధి చేయాలనుకుంటోంది.ఇక భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విశాఖకు అతి పెద్ద రోడ్ కనెక్టివిటీని పెంచుతోంది. ఆరు లైన్ల జాతీయ రహదారులను కేంద్రం నిర్మించేలా జగన్ సర్కార్ ఒప్పించింది. బీచ్ కారిడార్ అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది.

ఇక అన్నింటికంటే అతి పెద్ద అస్త్రంగా విశాఖ రాజధాని అన్నది వైసీపీ చేతిలో ఉంది. విశాఖను రాజధానిగా చేదామని అధికారికంగా అనుకున్న కూడా ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఈ కేసు ఉన్నదువల్ల వీలు కాదు. దాంతో వయా మీడియాగా జగన్ అక్టోబర్ నుంచి విశాఖకు మకాం మారుతున్నారు. అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. వారంలో మూడు రోజులు జగన్ విశాఖలో ఉంటారు అన్న మాట.

ఒక విధంగా చెప్పాలంటే ఇది విపక్షాలకు భారీ స్ట్రోక్ గా భావించాలి. అమరావతి రాజధానికి జై కొడుతున్న యావత్తు విపక్షం ఇపుడు జగన్ లేటెస్ట్ మూవ్ కి సరైన జవాబు చెప్పలేని పరిస్థితిలోనే పడ్డాయని అనుకోవాలి. ఈ నేపధ్యంలో విశాఖలో భూ కబ్జాలు అంటూ జనసేన టీడీపీ రెండూ ఆరోపిస్తున్నాయి. ఇక పవన్ వారాహి టూర్ చూసుకుంటే అనుకున్న గడువు కంటే ఒక రోజు ముందే ముగియడం విశేషం. జస్ట్ రెండు మీటింగ్స్ మాత్రమే పవన్ విశాఖలో పెట్టారు. భూ కబ్జాల మీద రుషికొండ విద్వంశం అంటూ పవన్ చేసిన విమర్శలు కూడా వైసీపీ నుంచి వచ్చిన సమాధానంతో సెల్ఫ్ గోల్ అయ్యాయని అంటున్నారు.

విశాఖలో భూ కబ్జాల విషయంలో టీడీపీని వదిలేసి కేవలం వైసెపీ మీదనే టార్గెట్ చేయడం వల్ల కూడా పవన్ ఆరోపణలు పెద్దగా పేలలేదు అని అంటున్నారు. 2014 నుంచి 2019 దాకా టీడీపీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలకు బీజం పడింది. కానీ పవన్ మాత్రం వైసీపీ నేతలే దోచేస్తున్నారు అంటూ చేసిన ఆరోపణలు జనంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయని అంటున్నారు.

ఇక పవన్ విశాఖ జిల్ల అంతా వారాహి రధమెక్కి ముమ్మరంగా కలియతిరుగుతారు అనుకుంటే తొందర గా ముగించారు అని అంటున్నారు. విశాఖలో పవన్ సభలకు జనాలు వచ్చినా కూడా ఆయన స్పీచుల ద్వారా వైసెపీని జగన్ని విమర్శించడం పట్ల విశాఖ సహా ఉత్తరాంధ్రాకు తాము ఏమి చేస్తామని కచ్చితంగా చెప్పలేకపోయారని అంటున్నారు. విశాఖను వైసీపీ రాజధానిగా చేస్తామని అంటోంది. మరి అలా కాదు అంటే విశాఖ డెవలప్మెంట్ కి టీడీపీ జనసేనల వద్ద ఆల్టర్నేషన్ విధానాలు ఏంటో చెప్పలేకపోవడం కూడా మైనస్ గా మారింది అని అంటున్నరు.

ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన విశాఖ బీచ్ లో నిర్వహించిన సమైక్య వాక్ కూడా పెద్దగా జనాలు లేకుండానే సాగింది అని అంటున్నారు. అనంతరం ఆయన విశాఖలో విజన్ 2047 పేరుతో రిలీజ్ చేసిన డాక్యుమెంట్ మీద కూడా జనంలో చర్చ అయితే లేకుండా పోయింది అని అంటున్నారు. చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ గురించి చెబుతున్న టైం లోనే ఆయన సభకు వచ్చిన జనాలు వెళ్లిపోవడం కూడా కనిపించింది అంటున్నారు. ఇక ఇదే మీటింగులో చంద్రబాబు ఇంజనీరింగ్ చదవాలీ అంటే బైపీసీ గ్రూప్ తీసుకోవాలంటూ చేసిన కామెంట్ ఇపుడు తెగ వైరల్ అయింది.

విశాఖ రాజధాని అని వైసీపీ ముందుకు వస్తూంటే దాని మీద మాట్లాడకుండా విశాఖ నేం ని డీ ఫేం చేసేలా అటు జనసేన ఇటు టీడీపీ కామెంట్స్ చేయడం మీద కూడా జనాల్లో చర్చ సాగుతోంది. విశాఖలో శాంతి భద్రతలు లేవు, విశాఖ నేరాల అడ్డా అటూ విశాఖ ఇమేజ్ ని దెబ్బ తీసేలా ప్రతిపక్షం కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే విశాఖలో రాజకీయ సమీకరణలు అయితే మారుతున్నట్ల్గుగా పరిస్థితి ఉంది. 2024లో ఎవరికి ఓటు వేస్తారో తెలియదు కానీ వైసీపీ మాత్రం పాలనను విశాఖ నుంచి మొదలెట్టడం ద్వారా రజధాని కళను తెచ్చేస్తోంది. ఇది ఆ పార్టీకి ప్లస్ అయ్యేలా ఉందనే అంటున్నారు.

Tags:    

Similar News