కోడి ముందో.. గుడ్డు ముందో చెప్పిన శాస్త్రవేత్తలు.. ఆసక్తికర విషయాలు!

అవును... ఇంతకాలం తర్కానికి అందని చిక్కు ప్రశ్నగా మిగిలిపోయిన "గోడి ముందా.. గుడ్డు ముందా?" అనే ప్రశ్నకు తాజాగా శాస్త్రవేత్తలు సమాధానం చెప్పారు.

Update: 2024-11-20 17:30 GMT

ఓ సినిమాలోని ఓ క్యారెక్టర్ "కోడి ముందా..? గుడ్డు ముందా..?.." ప్రశ్న అడిగితే... "కోడే ముందు" అని సమాధానం ఇస్తాడు. దానికి అతడు ఇచ్చిన సరదా వివరణ... "ఎందుకంటే... కోడి ముందుకి ఉంటుంది.. గుడ్డు వెనక నుంచి వస్తుంది!" అని! ఈ సమాధానం సినిమాలో కామెడీకి సరిపోవచ్చు కానీ... అసలు సమాధానం తాజాగా చెప్పారు శాస్త్రవేత్తలు.

అవును... ఇంతకాలం తర్కానికి అందని చిక్కు ప్రశ్నగా మిగిలిపోయిన "కోడి ముందా.. గుడ్డు ముందా?" అనే ప్రశ్నకు తాజాగా శాస్త్రవేత్తలు సమాధానం చెప్పారు. "గుడ్డే ముందు" అని తేల్చి చెప్పారు. దీనికి వారు చెప్పిన కారణం... పురాతన ఏక కణ జీవులను పరిశీలించినప్పుడు.. ఆ కణాల్లో గుడ్డు లక్షణాలు కనిపించాయంట. దీంతో.. ఈ కన్ క్లూజన్ కి వచ్చారు!

సుమారు బిలియన్ సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉన్న ఇస్థియోస్పోరియన్ సూక్షజీవి అయిన క్రోమోస్పేరా పెర్కిన్సి అనే ఏక కణ జీవికి సంబంధించిన అధ్యయనం నుంచి ఈ విషయం వెల్లడైందని అంటున్నారు. జెనీవా యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్త మెరైన్ ఒలివెట్టా నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన చేసింది.

ఈ పరిశోధనలో క్రోమోస్పేరా పెర్కిన్సీ జంతు పిండం అభివృద్ధికి అద్భుతమైన రీతిలో పునరుత్పత్తి చేస్తుందని గమనించారంట! ఈ క్రమంలోనే జంతువుల పరిణామానికి ముందు గుడ్డు అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఇది కన్వర్జెంట్ ఎవల్యూషన్ యొక్క సందర్భం అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇక్కడ ఒకే విధమైన లక్షణాలు వేర్వేరు జీవులలో స్వతంత్రంగా పరిణామం చెందుతాయని.. క్రోమోస్పేరా పెర్కిన్సీలో గమనించిన ప్రత్యేక అభివృద్ధి ఇతర ఇస్థియోస్పోరియన్లలో కనిపించలేదని.. అయితే.. ఇది పూరీకుల లక్షణమా లేదా సమాంతర పరిణామ ఫలితమా అనేది నిర్ధరించడం కష్టతరం చేస్తుందని తెలిపారు.

తాజాగా ప్రచురించబడిన ఈ సంచలనాత్మక పరిశోధన... జంతు జీవిత మూలాలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా.. భూమిపై ఉన్న సరళమైన జీవన రూపాల విశేషమైన సంక్లిష్టతను కూడా ప్రదర్శిస్తుంది. ఈ నేపథ్యంలోనే... కోడి లేదా గుడ్డు లో గుడ్డే ముందు వచ్చిందని అంటున్నారు!

Tags:    

Similar News