బాబుపై రంకెలేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మ‌రో ర‌చ్చ చేశారుగా

ఇటీవ‌ల ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై చేసిన వ్యాఖ్య‌లతో ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి ఎక్కిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మ‌రోమారు అంత‌కంటే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Update: 2024-10-25 21:30 GMT

ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎంపికైన రాజ‌కీయ నాయ‌కులు స‌హజంగానే ప్ర‌జ‌ల ప‌క్షం ఉండాల్సిందే. ఆ క్ర‌మంలో వారు ప్ర‌జ‌ల‌ ఆవేద‌న‌ను, త‌మ ఆలోచ‌న‌ను వ్య‌క్తం చేసేట‌పుడు ఒకింత సంయ‌మ‌నం పాటించాల‌ని కోరుకుంటుంటారు. అలా జ‌ర‌గ‌ని పక్షంలో వారి ప్ర‌త్య‌ర్థులు స‌ద‌రు కామెంట్ల‌ను వైర‌ల్ చేస్తారు తాజాగా అలా ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్ అయ్యాయి. ఆయ‌నే జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఇటీవ‌ల ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై చేసిన వ్యాఖ్య‌లతో ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి ఎక్కిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మ‌రోమారు అంత‌కంటే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

త‌న నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని వివిధ అంశాల‌పై తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందిస్తూ జడ్చర్ల మండలంలోని పోలేపల్లి ప్ర‌జ‌లు క‌లుషిత నీటితో స‌మ‌స్య‌లు ఎదుర్కుంటున్నారు తెలిపారు. అరబిందో, హెటిరో, శిల్ప కంపెనీలు కలుషిత నీటిని విడుదల చేస్తున్నాయని స్థానిక రైతులు త‌న దృష్టికి తీసుకువ‌చ్చార‌ని ఎమ్మెల్యే వివ‌రించారు. కలుషిత నీటి సరఫరా జరుగకుండా వెంటనే చూడాలని రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. కలుషిత నీటి విడుదల ఆపకపోతే అరబిందో కంపెనీని తగలబెడతానని వార్నింగ్ ఇచ్చారు. అరబిందో కంపెనీ పై ఎమ్మెల్యే చేసి సంచలన వ్యాఖ్యలు వైర‌ల్ అయ్యాయి.

ఇటీవ‌ల తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న అనంత‌రం సైతం అనిరుధ్ రెడ్డి ఇలాంటి కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఏపీకి చెందిన ప్రజాప్రతినిధుల లేఖలతో తెలంగాణలోని పలు పుణ్య క్షేత్రాలకు భక్తులు వచ్చినప్పుడు వారందరికి దర్శనాలు కల్పిస్తున్నామని పేర్కొంటూ... తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను తిరుమ‌ల‌లో అనుమతించకపోవడం ఏంట‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల లేఖలతో తిరుమలకు భక్తులు వచ్చినప్పుడు దర్శనానికి ఎందుకు అనుమతి ఇవ్వరని నిలదీశారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు అనుమతి ఇవ్వకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వం బాధపడాల్సి వస్తుందని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News