"ఏనీ డౌట్స్?"... జగన్ పై యతిప్రాసలతో అనిత సంచలన వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా యతిప్రాసలతో పలు కామెంట్లు చేసిన ఐత... "సింహం సింగిల్ గా రావడం అంటే ఇదే" అంటూ చంద్రబాబుని ఉద్దేశించి ఆసక్తీక్ర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అనంతరం రూ.43,402 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి అచ్చెన్న వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీ అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా... గతంలో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరలా అసెంబ్లీకి వచ్చారని అన్నారు.
అయితే... వైసీపీ అధినేత జగన్ మాత్రం బడ్జెట్ సమావేశాలకు రాకుండా తప్పించుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా యతిప్రాసలతో పలు కామెంట్లు చేసిన ఐత... "సింహం సింగిల్ గా రావడం అంటే ఇదే" అంటూ చంద్రబాబుని ఉద్దేశించి ఆసక్తీక్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చేసిన ఈ పోస్ట్ కి సంబంధించిన కామెంట్ సెక్షన్ లో ఫుల్ సందడి నెలకొంది.
ఈ సందర్భంగా అనిత 'ఎక్స్' లో స్పందిస్తూ... "నక్క తెలివి తేటలతో ఎమ్మెల్యేలను అటు నుంచి ఇటు లాగేశావ్.. బూతే సిగ్గుపడేలా బూతులు తిట్టించావ్.. ప్రతిపక్ష నాయకుల్నౌ ఈడి పాడేయమని స్పీకర్ ద్వారా అధికారికంగా ఆదేశాలిపీంచావ్.. స్పీకర్ జోన్ లోకి వెళ్లిన అందరినీ సస్పెండ్ చేయించావ్.. అయినా సాకులు చెప్పలేదు" అంటూ పోస్ట్ పెట్టారు.
ఇదే సమయంలో... "నాలుగు పక్కలా చుట్టుముట్టి కాలకేయుల్లా మీద పడే మీ ఉన్మాద గుంపుల మధ్యలోకి ఒక్కడిగా వచ్చారు.. ప్రజల తరుపున ఒక్కడై గొంతు విప్పారు.. ప్రజాగళం బలంగా వినిపించారు.. అరెస్ట్ అయినా మొక్కవోని దీక్షతో ముందడుగేశారు.. అదీ నిబద్ధత, అదీ ధైర్యం, అదీ సింహం సింగిల్ గా రావడం అంటే.." అంటూ అనిత స్ట్రాంగ్ పోస్ట్ పెట్టారు.
అనంతరం... వాచీలో మూడు మీద ముల్లాడటం లేదన్ని.. ఇంటి బయట బెల్ ఆడటం లేదని.. లోపల గాలాడటం లేదని పిల్లాటలు ఆడటం కాదు.. అంటూ ప్రాసలతో స్పందించిన అనిత... "చెరువుగట్టున పంచె ఎగ్గట్టుకుని సింగిల్ గా పోయేవన్నీ సింహాలు కాదు! ఎవరు సింహమో.. ఎవరు మేకవన్నె పులో వేరే చెప్పాలా?.. ఎనీ డౌట్స్?" అంటూ ముగించారు.