కేజ్రీవాల్ మీద అన్నా హజారే ఆగ్రహం ఆలాగే ?

ఆయనకు అధికారాల మీద పదవుల మీద అపేక్ష లేదు. ఆయన నిస్వార్ధంగా ఉద్యమాలు చేశారు.

Update: 2024-09-16 03:58 GMT

అరవింద్ కేజ్రీవాల్ అన్న ఒక అధికారి రాజకీయ నేతగా రూపాంతరం చెందడానికి ముందు సామాజిక ఉద్యమ నేత. ఆ విధంగా ఆ సమయంలో ఆయనకు అండదండగా ఉంటూ వచ్చిన వారు అన్నా హజారే. అన్నా హజారే భారత దేశం ఎరిగిన అతి పెద్ద సామాజిక ఉద్యమ నాయకుడు. అభినవ గాంధీ గా చెప్పుకుంటారు.

ఆయనకు అధికారాల మీద పదవుల మీద అపేక్ష లేదు. ఆయన నిస్వార్ధంగా ఉద్యమాలు చేశారు. అందుకే రాజకీయాలకు అతీతంగా ఆయనకు జనాలు ఎంతో మంది అభిమానులు. ఇక అన్నా హజారే చేసిన అతి పెద్ద ఉద్యమాలలో అవినీతికి వ్యతిరేకంగా 2011 ప్రాంతంలో చేసిన ఉద్యమం గొప్పది, ఎన్నదగినది. ఒక విధంగా చూస్తే దేశ రాజకీయాలను మలుపు తిప్పింది.

ఆ ఉద్యమ ఫలితాలను పూర్తిగా అందుకుకు రాజకీయ లబ్ది పొందినది బీజేపీ అలాగే అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ యూపీఏ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు ఎంత చేసినా దేశ ప్రజల మైండ్ సెట్ ని మార్చిన ఉద్యమ నేతగా అన్నా హజారే ఉంటారు. ఆయన అవినీతి మీద దేశ ప్రజల మెదళ్లలో నాటిన విత్తనాలు బీజేపీకి అందునా గుజరాత్ మోడల్ అంటూ వచ్చి జాతీయ రాజకీయాలకు కొత్తగా పరిచయం అయిన నాయకుడికి అందలం అందించాయి.

అలాగే ఢిల్లీలో చూస్తే అరవింద్ కేజ్రీవాల్ ఆ ఉద్యమం నుంచి వచ్చిన క్రేజ్ ని ఆసరాగా చేసుకుని ఆప్ ని స్థాపించి మూడు సార్లు సీఎం అయ్యారు. అయితే సామాజిక ఉద్యమాన్ని బీజేపీ ఎలా వాడుకున్నా అది రాజకీయ పార్టీ కాబట్టి ఓకే. కానీ తన శిష్యుడు రాజకీయాల్లోకి వెళ్లడం మాత్రం అన్నా హజారేకు ఏ మాత్రం ఇష్టం లేదు అని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఈ విషయంలోనే గురు శిష్యుల మధ్య విభేదాలు వచ్చాయి. అయితే పార్టీ పెట్టి సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా కేజ్రీవాల్ నిలిచారు. సింగిల్ టెర్మ్ సీఎం కాకుండా పార్టీని విస్తరించి పంజాబ్ రాష్ట్రంలో రెండవ సీఎం ని కూడా సాధించారు. జాతీయ పార్టీగా కూడా గుర్తింపు ఆప్ కి తెచ్చి పెట్టారు.

అయితే అరవింద్ కేజ్రీ వాల్ లిక్కర్ స్కాం లో జైలు జీవితం అనుభవైస్తున్నారు. ఈ సమయంలో బెయిల్ మీద వచ్చిన ఆయన తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. దాని మీద స్పందించిన అన్నా హజారే సంచలన కామెంట్స్ చేశారు.

అరవింద్ కేజ్రీవాల్ ని రాజకీయాల్లోకి రావద్దు అని తాను గతంలోనే హెచ్చరించాను అని ఆయన గుర్తు చేశారు. దానికి బదులుగా సామాజిక సేవ చేయాలని కోరినట్లుగా చెప్పారు. అయితే కేజ్రీవాల్ మాత్రం తన మాటలను పట్టించుకోలేదని అన్నారు. అందువల్లనే ఆయన ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు.

అంతే కాదు కేజ్రీవాల్ తన సొంత చర్యల మూలంగానే మద్యం పాలసీ విషయంలో అరెస్ట్ అయ్యారని చెప్పడం విశేషం. అంటే అరవింద్ కేజ్రీవాల్ తప్పు చేశారు అని గురువు అన్నా హజారే భావిస్తున్నారా అన్న చర్చకు తెర లేచింది. ఆయన చర్యలు తనను నిరుత్సాహానికి గురి చేశాయని కూడా అన్నా హజారే అన్నారు. మొత్తానికి శిష్యుడి పోకడలు గురువుకు నచ్చడం లేదు అని అంటున్నారు.

అయితే రాజకీయంగా శిష్యుడు బాగానే ఎదిగారు. రొటీన్ పొలిటీషియన్ల కంటే కూడా మంచి పాలన అందిస్తున్నారు. అవినీతి విషయంలో ఆప్ మీద పెద్దగా ఆరోపణలు లేవు. లిక్కర్ స్కాం విషయంలో నిజానిజాలు తేలాల్సి ఉంది. కేజ్రీవాల్ అయితే తాను తప్పు చేయలేదని అంటున్నారు. కానీ గురువు మాత్రం శిష్యుడు సొంత చర్యలు అని ఆయన మీదనే వేలెత్తి చూపిస్తున్నారు. ఈ మొత్తం చూస్తూంటే గురువుకి శిష్యుడి మీద కోపం పోయినట్లుగా లేదని అంటున్నారు.

Tags:    

Similar News