ఈవై చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!.. అధిపతికి ఆరు నెలల వరకూ జైలు శిక్ష?

ఆ సమస్థ 2007 నుంచి పనిగంటలను నియంత్రించడానికి రాష్ట్ర అనుమతి లేకుండా పనిచేస్తుందని దర్యాప్తులో తేలిందని అంటున్నారు.

Update: 2024-09-26 04:02 GMT

అధిక పనిభారం కారణంగా ఎర్నెస్ట్ & యంగ్ (ఈవై)లో 26 ఏళ్ల ఉద్యోగి మరణించిన విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో ఆ సంస్థ చుట్టూ ఉచ్చు బిగుస్తుందని.. ఆ సమస్థ 2007 నుంచి పనిగంటలను నియంత్రించడానికి రాష్ట్ర అనుమతి లేకుండా పనిచేస్తుందని దర్యాప్తులో తేలిందని అంటున్నారు.

అవును... రాయిటర్స్ నివేదిక ప్రకారం ఆడిట్ ఎగ్జిక్యూటివ్ అన్నా సెబాస్టియన్ పూణెలోని ఈవై కార్యాలయంలో పని చేస్తున్నాప్పుడు అధిక పనిభారం కారణంగా చనిపోయిందని ఆమె తల్లి ఈవై ఇండియా ఛైర్మన్ రాజీవ్ మెమనికి లేఖ రాశారు. అన్నా సెబాస్టియన్ గుండెపోటుతో మరణించారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ సందర్భంగా... ఆమె వారంతపు రోజుల్లో కూడా అర్థరాత్రి వరకూ పనిచేసిందని.. ఆమెకు ఊపిరి పీచుకునే అవకాశం కూడా లేదని.. అన్నా సెబాస్టియన్ తల్లి తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ.. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యంపై అధిక ఒత్తిడి ప్రభావం గురించి చర్చకు దారితీసింది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అడిషనల్ లేబర్ కమిషనర్ శైలేంద్ర పోల్, అతని టీం ఈవై పూణే కార్యాలయాన్ని తనిఖీ చేసి, రాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం తప్పనిసరి అనుమతి పర్మిట్ లేకుండా పనిచేస్తున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ కంపెనీ ఫిబ్రవరి 2004లో మాత్రమే రిజిస్ట్రేషన్ కొసం దరఖస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారని అంటున్నారు.

అయితే... ఈ వ్యవహారంపై ప్రతిస్పందించడానికి, వివరించడానికీ ఈవై ఇండియాకు ఏడు రోజుల సమయం ఇవ్వబడిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చట్టాన్ని పాటించని పక్షంలో తీవ్రమైన శారీరాక గాయం లేదా ఎంప్లాయ్ మరణానికి దారితీసె ప్రమాదానికి కారణమైనట్లయితే కంపెనీకి రూ.5 లక్షల వరకూ జరిమానా, అధిపతికి ఆరు నెలల వరకూ జైలు శిక్ష విధించబడుతుందని అంటున్నారు.

మరోపక్క జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ కేసును సుమోటోగా పరిగణలోకి తీసుకుంది. ఇదే సమయంలో కేంద్ర కార్మిక ఉపాధి శాఖకు మానవ హక్కుల సంఘం నోటీసు జారీ చెసింది. ఈ వ్యవహారంపై వివరాణాత్మక నివేదికను కోరింది.

Tags:    

Similar News