రామ్ గోపాల్ వర్మపై మరో కేసు.. ఈసారి ఎక్కడంటే..?

అభ్యంతరకర పోస్టులు పెట్టినవారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో తన పర బేధాలు, వారు వీరు అనే తారతమ్యాలు చూడటం లేదని అంటున్నారు.

Update: 2024-11-12 07:51 GMT

సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టేవాళ్లు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారు, అసహ్యకరమైన కామెంట్లు చేసేవారీపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ విషయం కీలకంగా మారింది. ఈ సమయంలో సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై వరుస కేసులు నమోదవుతున్నాయి.

అవును... సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంలోని పెద్దలు, నాయకులు, వారి వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెట్టినవారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో తన పర బేధాలు, వారు వీరు అనే తారతమ్యాలు చూడటం లేదని అంటున్నారు. ఈ సమయంలో ఆర్జీవీపై ఐటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి!

గతంలో ఎన్నికలకు ముందు "వ్యూహం" అనే సినిమాను చిత్రీకరించి విడుదల చేసిన ఆర్జీవీ... ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులను, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా "ఎక్స్"లో పోస్టులు పెట్టారు. దీనిపై మద్దిపాడు మండలం టీడీపీ కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదే సమయంలో... గుంటూరు జిల్లాలోనూ ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇందులో భాగంగా... చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ల ఫోటోలను వర్మ గతంలో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో పోస్టులు పెట్టారంటూ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News