ముడా స్కామ్ లో కర్ణాటక సీఎంకు మరో బిగ్ షాక్!

అవును... కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ముడా కుంభకోణం కేసులో ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది.

Update: 2024-09-30 14:10 GMT

మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కు తాజాగా బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా ఈ వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. సీఎం సిద్ధరామయ్యపై మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసింది!

అవును... కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ముడా కుంభకోణం కేసులో ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు పొందుపరిచిన ఎఫ్.ఐ.ఆర్. ఆధారంగా సెంట్రల్ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) ద్వారా కేసు నమోదు చేసింది!

తద్వారా నిందితులను విచారణకు పిలిచేందుకు, విచారణ సమయంలో వారి ఆస్తులకు కూడా అటాచ్ చేసేందుకు ఈడీకి అధికారం దక్కినట్లయ్యిందని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.

కాగా... ముడా స్థలాల కేటాయింపుల విషయంలో సీఎం సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. దీనికోసం సీఎం తన అధికారన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం.. కర్ణాటక గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అబ్రహాంతో పాటు మరికొంతమంది ఫిర్యాదు చేశారు.

దీంతో... ముడా స్థలాల విషయంలో ముఖ్యమంత్రిని విచారించాలని ఆగస్టు 16న గవర్నర్ ఆదేశించారు. అయితే... గవర్నర్ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ తీర్మానాన్ని గవర్నర్ తోసిపుచ్చారు. దీంతో... వ్యవహారం కోర్టుకి చేరుకుంది. కోర్టులో సీఎం సిద్ధరామయ్యకు చుక్కెదురైంది.

ఈ సమయంలో లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు మనీలాండరింగ్ అంశంపై ఈడీ కూడా కేసు నమోదుచేసింది. దీంతో... సిద్ధరామయ్య ఫ్యూచర్ పై తీవ్ర చర్చ మొదలైంది!

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు