పిల్లలకు సోషల్ మీడియా నిషేధం... మస్క్ కు ఇచ్చి పడేసిన ఆస్ట్రేలియా ప్రధాని!
సోషల్ మీడియా విషయంలో ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియా విషయంలో ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా బిల్లు తీసుకొచ్చారు. త్వరలో ఇది చట్టం కాబోతుంది. అనంతరం సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ కు ఆ మేరకు టెక్నికల్ ఇష్యూస్ సెట్ చేసుకోవడానికి ఏడాది సమయం ఇవ్వనున్నారు!
ఈ నిర్ణయాన్ని చాలా మంది అభినందిస్తున్నారు. దీనికి భారత్ లోని పలువురు ప్రముఖులు స్వాగతిస్తున్నారు. భారత్ లోనూ ఇలాంటి నిర్ణయం దిశగా ప్రభుత్వం ఆలోచించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో.. వీటిని ఆస్ట్రేలియా ఖండించింది.
అవును... ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా బిల్లు తీసుకురావడంపై ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆస్ట్రేలియాలో ఇంటర్నెట్ యాక్సెస్ ను నియంత్రించడానికి ఈ నిషేధం బ్యాక్ డోర్ లా ఉందని మస్క్ విమర్శించారు. ఈ విమర్శలను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ తప్పుబట్టారు.
ఇందులో భాగంగా... ఎలాన్ మస్క్ ఓ అజెండాను కలిగి ఉన్నారని.. ఆయన ఎక్స్ యజమాని అవ్వడం వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని.. సోషల్ మీడియా నిర్ణయంపై ఎవరితోనైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో... మస్క్ ను ఆంటోనీ ఆల్బనీస్ గట్టిగానే తగులుకున్నారనే చర్చ మొదలైంది.
కాగా... ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదించిన ఈ బిల్లుకు సెనెట్ ఆమోదం తెల్లిపితే చట్టరూపం దాల్చనున్న సంగతి తెలిసిందే. ఒక వేళ ఈ నిబంధనలను సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లు ఉల్లంఘిస్తే వారిపై 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు రూ.273 కోట్లు) జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.