ఏపీ అసెంబ్లీలో ఏడు కీలక బిల్లుల ఆమోదం... ఇకపై ఆ సమస్య లేదు!

స్థానిక సంస్థల ఎన్నీకల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-11-18 20:30 GMT

స్థానిక సంస్థల ఎన్నీకల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఇకపై ఎంతమంది పిల్లలు ఉన్నా పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులేనని వెల్లడించింది. ఈ మేరకు జనాభా వృద్ధిరేటూ పెంపులో భాగంగా.. ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

అవును... ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు - 2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు - 2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు - 2024 తదితర ఏడు కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. ఇకపై ఎంతమంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలు మార్చింది.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు - 2024 ఆమోదం కోసం నారాయణ సభలో ప్రతిపాదించారు. జనాభా వృద్ధి రేటు పెంపుదలలో భాగంగానే చట్టంలో మార్పులు తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. మండలి ఆమోదం తర్వాత జీవో జారీ చేయగానే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

కాగా... గతంలో ఇద్దరి కంటే ఎక్కువమంది సంతానం ఉంటే.. వారు పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిబంధనను ఎత్తేస్తూ సవరించిన బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందింది.

ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన ఏడు బిల్లులు...!:

ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు - 2024

ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు - 2024

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు - 2024

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ బిల్లు - 2024

ఏపీ సహకార సంఘం సవరణ బిల్లు - 2024

ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు - 2024

ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్ట సవరణ బిల్లు - 2024

Tags:    

Similar News