కమలం గుసగుస: పురందేశ్వరి పాట్లు అన్నీ ఇన్నీ కావా ..!
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తిప్పలు పడుతున్నారా? కేంద్రంలోని పెద్దలకు పదే పదే విన్నపాలు చేస్తు న్నారా? అంటే.. ఔననే అంటున్నారు జాతీయ రాజకీయ విశ్లేషకులు.;

ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తిప్పలు పడుతున్నారా? కేంద్రంలోని పెద్దలకు పదే పదే విన్నపాలు చేస్తు న్నారా? అంటే.. ఔననే అంటున్నారు జాతీయ రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్‌ను కూడా మారుస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఉన్న ఒక్క ఆధారం కూడా పోతే.. తనకు ఇబ్బందే నని చిన్నమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పురందేశ్వరి రాజకీయాలు చూస్తే, ఆది నుంచి కూడా ఆమె హైప్రొఫైల్ రాజకీయాలే చేశారు.
రాజకీయాల్లోకి వస్తూ వస్తూనే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా విజయం దక్కించుకున్నారు. ఆ వెంటనే కేంద్రంలో మంత్రి అయ్యారు. అప్పటి మన్మోహన్ సింగ్ మంత్రి వర్గం చక్రం తిప్పారు. అయితే.. రాష్ట్ర విభజనతో ఆమె కొంత గందరగోళానికి గురైనా.. ఆ వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఓడి పోయారు.ఆ సమయంలో బయటకు రాలేదు. ఇక, గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి విజయం దక్కించుకునేందుకు ముందే.. బీజేపీ పగ్గాలు చేపట్టారు.
రాష్ట్ర స్థాయిలో కమల నాథులను ముందుకు నడిపించారు. ఇక, ఎంపీగా కూడా ..చక్రం తిప్పుతున్నారు. అయితే.. ఆమె ఆశ, కోరిక కేంద్రంలో మంత్రి కావడం. కానీ, సామాజిక ఈక్వేషన్ పరంగా చూస్తే.. రాష్ట్రం నుంచి కమ్మ సామాజిక వర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. సో.. ఆమె పదవి ఆశలు అక్కడితో ఆగాయి. ఇక, ఇప్పుడు రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఉండడంతో కేంద్రంలో మంచి పలుకుబడితో ముందుకు సాగుతున్నారు.
కానీ, ఇప్పుడు ఆ పదవిని కూడా తీసేస్తారని వస్తున్న వార్తలు సహజంగానే పురందేశ్వరిలో కలవరం కలిగి స్తున్నాయి. దీనిని గమనించిన పురందేశ్వరి.. తన పదవీ కాలం ఏడాదిన్నరే అయిందని.. ఇప్పటికిప్పుడు తీసేయడం సరికాదని.. పూర్తికాలం 2 సంవత్సరాలు తనకు ఈ పదవిని ఇవ్వాలని కోరుతున్నారు. లేదా.. కేంద్రంలో అవకాశం ఇవ్వాలని ఆమె పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తరచుగా పురందేశ్వరి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.