ఏపీ బీజేపీ నేత నగ్న వీడియో కాల్... ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ రచ్చ!!

రాజకీయ నాయకులంటే సామాన్య ప్రజానికానికి ఆదర్శంగా ఉండాలి అనే రోజులు పోయాయనే కామెంట్లు ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే

Update: 2024-10-11 01:30 GMT

రాజకీయ నాయకులంటే సామాన్య ప్రజానికానికి ఆదర్శంగా ఉండాలి అనే రోజులు పోయాయనే కామెంట్లు ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు నేతల మాటల్లోనూ, చేష్టల్లోనూ, నిలకడలేనితనంలోనూ, విషయాలపై అవగాహనా రాహిత్యంలోనూ... ప్రజల చీత్కారాలను ఎదుర్కోంటున్న పరిస్థితులు రెగ్యులర్ గా కనిపిస్తున్నాయి!

ఇక ఇటీవల కాలంలో మరికొన్ని పైత్యాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా బూతులు మాట్లాడటాలు, ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో సెల్ ఫోన్స్ లో నీలి చిత్రాలు చూడటాలు వంటి పలు ఘటనలు మీడియాలో దర్శనమిచ్చిన పరిస్థితి. ఇక గత కొంతకాలంగా ఇతర స్త్రీలతో నగ్న వీడియోకాల్స్ మాట్లాడటాలు, అత్యాచారాలు చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తారతమ్యాలేమీ లేవనే చెప్పాలి! ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు.. పార్టీలో ఏవరో ఒకరిద్దరు చేశారని ఆ మసిని పార్టీ మొత్తానికీ పూయాల్సిన అవసరం అంతకంటే లేదు! ఆ సంగతి అలా ఉంచితే... తాజాగా ఏపీలో భారతీయ జనతాపార్టీకి చెందిన ఓ కీలక నేత నగ్న వీడియో కాల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది!

అవును... ఇటీవల కాలంలో నగ్న వీడియో కాల్స్ లో మాట్లాడుతూ, ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ పలువురు నేతలు చేస్తున్న వీడియోలు బయటకు వస్తోన్న సంఘటనలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. తర్వాత వాటిని వారు ఎలా సమర్ధించుకున్నప్పటికీ.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతోంది. ఈ సమయంలో తాజాగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు జిల్లాకు చెందిన ఓ నాయకుడి నగ్న వీడియో కాల్ వెలుగులోకి వచ్చింది.

తమ పార్టీకి చెందిన ఓ మహిళతో ఆయన వీడియో కాల్ మాట్లాడుతూ.. అందులో నగ్నంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.. నెట్టింట రచ్చ రచ్చ చేస్తోందని అంటున్నారు! దీంతో ఈ వ్యవహారంపై పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్లింది. దీంతో... బీజేపీలో మీడియా వ్యవహారాలు పర్యవేక్షించే నేత దీనిపై విచారణ షురూ చేసినట్లు చెబుతున్నారు.

విచారణ అనంతరం ఆ నివేదికను పార్టీ పెద్దలకు ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే... ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనాయకుడి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో తాజాగా మరో నేత నగ్న వీడియో బయటకు రావడంతో మరింత కలకలం రేగింది. ఈ వ్యవహారంపై అధిష్టాణం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి!!

Tags:    

Similar News