ఢిల్లీ రిజల్ట్...ఏపీ జనం మూడ్ క్లియర్ గా ఉందా ?
అదే సమయంలో ఆర్ధిక ఖజానాను ఫణంగా పెట్టి సంక్షేమ పధకాలను ఉచితాలను కొనసాగించడం ఎంతవరకూ సమంజసం అన్న ఆలోచన కూడా మేధావి వర్గం వినిపిస్తోంది.
సంక్షేమ పధకాలు దండుగ అనే సెక్షన్ ఒకటి ఉంది. ఇస్తే పండుగ అన్న సెక్షన్ మరో వైపు ఉంది. అదే సమయంలో ఆర్ధిక ఖజానాను ఫణంగా పెట్టి సంక్షేమ పధకాలను ఉచితాలను కొనసాగించడం ఎంతవరకూ సమంజసం అన్న ఆలోచన కూడా మేధావి వర్గం వినిపిస్తోంది.
ఇంకో వైపు చూస్తే కళ్ళ ముందే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి ఉంది. ఆప్ ఎన్నో సంక్షేమ పధకాలను అమలు చేసి కూడా ఓటమి పాలు అయింది. ఇక తెలంగాణాలో కేసీఆర్ కానీ ఏపీలో వైసీపీ కానీ సంక్షేమ పధకాలను పెద్ద ఎత్తున అమలు చేసినా ఫలితం తేడా కొట్టింది. దాంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టించాకనే పధకాలను అమలు చేస్తామని చెబుతున్నారు.
అయితే సంపద సృష్టి పధకాల అమలు ఈ రెండూ సమాంతరంగా కొనసాగాలి తప్పించి సంపద సృష్టి వరకూ ఆగితే పధకాలను ఆశించే జనాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న చర్చ కూడా ఉంది. అయితే ప్రజలను చైతన్యవంతులను చేస్తామని కూటమి నేతలు చెబుతున్నారు.
కానీ అయిదేళ్ళ పాటు క్రమం తప్పకుండా వైసీపీ ప్రభుత్వం అధించిన పధకాలను అందుకున్న వారు ఇపుడు కూటమి ప్రభుత్వం సంపద సృష్టితో పధకాలను వాయిదా వేస్తే ఊరుకుంటారా లేక సహకరిస్తారా అన్నది కూడా చర్చగానే ఉంది.
ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పధకాల మీద తన అసలైన స్టాండ్ ఏంటి అన్నది బడ్జెట్ లోనే చెప్పబోతోంది అని అంటున్నారు. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ఏపీలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 28న ఏపీ బడ్జెట్ ఉండబోతోంది. దాదాపుగా మూడు లక్షల కోట్ల దాకా ఈ బడ్జెట్ ఉండవచ్చు అని అంటున్నారు.
ఈ బడ్జెట్ లో ఏ ఏ రంగాలకు ఎంత కేటాయింపులు ఉంటాయన్నది కూడా ఆసక్తిని పెంచుతోంది. అదే సమయంలో సంక్షేమ పథకాలకు బడ్జెట్ లో నిధులు ఏ మేరకు కేటాయిస్తారు అన్న దానిని బట్టే కూటమి ప్రభుత్వం పెద్దల ఆలోచనలు ఏమిటి సంపద సృష్టి మీద వారి ప్రణాళికలు ఏమిటి అన్నది తెలుస్తాయని అంటున్నారు.
అయితే రాజకీయంగా చూస్తే పధకాలను వాయిదా వేయడం మంచి పరిణామం కాదని ఒక వాదన వినిపిస్తోంది అంటున్నారు జగన్ జిల్లాల పర్యటనలు పెట్టుకున్న క్రమంలో ఆయనకు ఊతమిచ్చేలా ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల ముఖ్యమైన పధకాలను ఈ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ ఉంచుతారని అంటున్నారు. అయితే వాటిని దశల వారీగా అమలు చేస్తామని ఒక మాట చెబుతారా అన్నది కూడా ప్రచారంలో ఉంది.
మరో వైపు చూస్తే ఏ పధకం అమలు చేయడానికి అయినా ఆర్ధిక పరిస్థితులు అయితే పెద్దగా సహకరించడం లేదు అని అంటున్నారు. అభివృద్ధి అజెండాను ప్రధమ ప్రాధాన్యతగా చేసుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి సంక్షేమానికి నిధులు సర్దుబాటు చేయడం పెను సవాల్ గా ఉందని అంటున్నారు. దాంతో ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అన్నది ఆసక్తిగా మారుతోంది. మొత్తం మీద చూస్తే కనుక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్న కూటమి ప్రభుత్వం ముందు అనేక లెక్కల చిక్కులు ఉన్నాయని అంటున్నారు.
నిన్న ఏపీ నేడు ఢిల్లీ అంటూ బటన్ నొక్కుడుకు ప్రజలు విరామం ప్రకటించారు అన్నంత ఈజీగా పధకాలను వాయిదా వేయలేరని అంటున్నారు. ఏపీలో వైసీపీ రూపంలో ప్రత్యర్ధి ఉన్నారు. అంతే కాదు ఏ చిన్న ఆవకాశం వైసీపీకి ఇవ్వరాదు అన్నది కూడా కూటమి పెద్దల వ్యూహంగా ఉంది. దాంతో ఈసారి బడ్జెట్ లో మెరుపులు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.