త్వరలో ఏపీ రోడ్ల పైకి ఉచిత బస్సులు !

ఇక చూస్తే కనుక గుంటూరుకు వంద, నెల్లూరుకు వంద బస్సులు ఇస్తారు. ఆ తరువాత కర్నూలు, కాకినాడ, కడప, అనంతపురం, రాజమండ్రిలకు తలో యాభై వంతున ఈ విధ్యుత్ బస్సులను కేటాయించనున్నారు.;

Update: 2025-04-14 18:09 GMT
త్వరలో  ఏపీ రోడ్ల పైకి ఉచిత బస్సులు !

ఏపీలో నలు చెరగులా తిరిగేందుకు ఉచిత బస్సులు రయ్ రయ్ మంటూ దూసుకు వస్తున్నాయి. అవి తొందరలోనే రోడ్ల మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉచిత బస్సుల విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోంది. అదే సమయంలో ప్రభుత్వానికి భారం కాకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

విద్యుత్తుతో నడిచే బస్సులను ఉచితంగా తిప్పేందుకు ప్రభుత్వం కొత్త ప్లాన్ ని రెడీ చేసింది. విద్యుత్ తో నడిచే బస్సులకు పెద్దగా భారం పడదు, అదే సమయంలో ఆర్టీసీకి కూడా ఆర్ధికంగా ఇబ్బందులు ఉండవని అంటున్నారు. ఇక ఉచిత బస్సులను కూడా కేవలం జిల్లాల పరిధిలో మాత్రమే తిప్పుతారు. అంటే రాష్ట్ర స్థాయిలో ఈ ఇచిత బస్సులలో ప్రయాణం కుదరదు అన్న మాట.

ఆ విధంగా చూసినా ప్రభుత్వానికి మరింత భారం కాకుండా చూసుకుంటున్నారు. మరో వైపు చూస్తే కొత్తగా ఏకంగా ఏడెనిమిది వందల ఉచిత బస్సులను నడపనున్నారు. ఎక్కువగా సిటీలకు వీటిని కేటాయిస్తారు అని అంటున్నారు. సిటీలలో ఎక్కువగా మహిళలకు బస్సు ఉచితంగా అందిస్తే మేలు జరుగుతుంది అన్నది కూడా ఉంది.

దాంతో ఈ ఉచిత బస్సుల పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. మొదటి దశలో ఏడెనిమిది వందల విద్యుత్ బస్సులను కొంటారు. వీటిని విశాఖపట్నానికి ఏకంగా వందకు పైగా బస్సులను కేటాయిస్తున్నారు. అదే విధంగా మరో మెట్రో సిటీ అయిన విజయవాడకు సైతం వందకు పైగా బస్సులు ఇస్తున్నారు.

ఇక చూస్తే కనుక గుంటూరుకు వంద, నెల్లూరుకు వంద బస్సులు ఇస్తారు. ఆ తరువాత కర్నూలు, కాకినాడ, కడప, అనంతపురం, రాజమండ్రిలకు తలో యాభై వంతున ఈ విధ్యుత్ బస్సులను కేటాయించనున్నారు. పుణ్య క్షేత్రం అయిన తిరుపతికి యాభై బస్సులను మంగళగిరికి మరో యాభై బస్సులను ఇస్తున్నారు.

వీటిని జనాలు ఎక్కువగా ఉండే చోట నడపడానిని నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ విధంగా ఉచిత బస్సులను ఏపీ రోడ్ల మీద నడపడం ద్వారా తాము ఇచ్చిన హామీని నెరవేర్చుకుని మహిళల కష్టాలను తీర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే విధంగా ఉభయ తారకంగా ఈ పధకం ఉండేలా చూసుకుంటోంది.

దీని వల్ల ఆర్టీసీకి కానీ ప్రభుత్వానికి కానీ పెద్దగా ఆర్ధిక భరం పడకుండా ఉంటుంది. ఇతర రాష్ట్రాలలో ఉచిత బస్సు హామీని ప్రమాణం చేసిన వెంటనే ప్రారంభించి ఆర్ధిక ఇబ్బందుల పాలు అయ్యారు. ఇపుడు వాటి నుంచి ఏపీ ప్రభుత్వం సరైన పాఠాలు నేర్చుకుని కాస్తా ఆలస్యం అయినా అమలు చేస్తోంది. సో ఈ పధకం తొందరలోనే ఏపీలోని మహిళలకు అందబోతోంది. వారు ఈ ఫలితాలను అనుభవించబోతున్నారు.

Tags:    

Similar News

పవన్ ఎక్కడ ?