ఆ నాలుగు ఛానెళ్లకు అసెంబ్లీలో నో ఎంట్రీ?

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఈ ఛానెళ్లపై ప్రభుత్వం కక్షగట్టిందని అంటున్నారు.

Update: 2025-02-24 09:32 GMT

అసెంబ్లీ సమావేశాలకు సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీ ఛానెళ్లకు సంబంధించిన రిపోర్టర్లను అసెంబ్లీలోకి అనుమతించలేదని వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ఆ నాలుగు ఛానెళ్లకు సంబంధించిన రిపోర్టర్లకు అసెంబ్లీ పాస్ లు ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని దుస్సంప్రదాయాన్ని ఏపీలో మొదలుబెట్టారని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఈ ఛానెళ్లపై ప్రభుత్వం కక్షగట్టిందని అంటున్నారు.

అయితే, ఈ వ్యవహారం నేపథ్యంలో వైసీపీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆ నాలుగు ఛానెళ్లను ఒకవేళ నిషేధించిన వార్త నిజమే అయినా..ఆ ట్రెండ్ మొదలుబెట్టింది వైసీపీ అని ట్రోల్ చేస్తున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరులను తన ప్రెస్ మీట్ లకు రావొద్దని జగన్ గతంలో బహిరంగంగా చెప్పిన వీడియోలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

ఇక, 2024 ఎన్నికలకు ముందు జగన్ పదే పదే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, మహాన్యూస్ అంటూ ఆ నాలుగు మీడియా హౌస్ లపై వందలసార్లు విషం చిమ్మారని, ఆ చానెళ్లు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయంటూ బహిరంగ వేదికలపై దుష్ప్రచారం చేశారని విమర్శిస్తున్నారు. కాబట్టి పక్కవాళ్లు చేస్తే...మనం చేస్తే సంసారం అన్న రీతిలో వైసీపీ నేతల కామెంట్లు ఉన్నాయని విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News