పేదలకు కూటమి సర్కార్ ఆరోగ్య వరం!

రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికీ నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు పాతిక లక్షల రూపాయలతో ఈ ఆరోగ్య బీమా పధకం అమలులోకి తెస్తామని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీకి తెలియచేశారు.

Update: 2025-02-28 14:30 GMT

ఏపీలో పేదలకు మధ్యతరగతి వర్గాలకు ఆరోగ్యవరాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చింది. 2025-2026 వార్షిక బడ్జెట్ లో ఏకంగా పాతిక లక్షల రూపాయల ఆరోగ్య బీమా పధకాన్ని అమలు చేయబోతున్నారు. ఇది నిజంగా మంచి పధకంగా చూడాల్సి ఉంది.

రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికీ నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు పాతిక లక్షల రూపాయలతో ఈ ఆరోగ్య బీమా పధకం అమలులోకి తెస్తామని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీకి తెలియచేశారు. ఈ పధకం అమలుతో పేదలు మధ్యతరగతి వర్గాలు కూడా నేరుగా కార్పోరేట్ ఆసుపత్రులలో వైద్యాన్ని పొందవచ్చు. అంటే వారి ఆరోగ్యానికి చక్కని భరోసాగా ఈ పధకం ఉంటుంది అన్న మాట.

సాధారణంగా ఆరోగ్య బీమాలను ఉన్నత మధ్యతరగతి వర్గాలు ఉన్నత వర్గాలు తీసుకుంటారు. దాని వల్ల వారికి మేఉ జరుగుతుంది. వారి ఆరోగ్యానికి ఒక బీమా ధీమా కూడా ఉంటాయి. కానీ పేదలు మధ్యతరగతి వర్గాలకు ఆ చాన్స్ లేదు.

పాలసీలు వారు అధిక మొత్తాలు చెల్లించి తీసుకోలేరు. వారికి ఆ స్తోమత ఉండదు. దాంతో వారు ఇబ్బందులో పడతారు. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినపుడు లక్షలలో ఖర్చు తట్టుకోలేరు. ఇక ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో సేవలు అందినా ఇపుడు దాని విష్యంలో కూడా పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. చాలా కార్పోరేట్ ఆసుపతులు ఆరోగ్యశ్రీని పక్కన పెడుతున్నాయి. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటేనే ఆపత్కాలంలో ప్రాణాలు నిలిచినట్లుగా ఉంటుంది.

అయితే ప్రభుత్వమే ఈ విషయంలో చొరవ చూపించి ఆరోగ్య బీమా కింద ఏడాదికి పాతిక లక్షలు ఒక కుటుంబం కోసం పాలసీని తీసుకోవడం హర్షణీయమని అంటున్నారు. ఈ పలసీకి అయ్యే సొమ్ముని ప్రభుత్వమే ప్రతీ ఏటా చెల్లిస్తుంది. దాంతో ఇది ఒక విధంగా ఆరోగ్య వరంగా పేదలకు ఉంటుంది అని అంటున్నారు. కూటమి బడ్జెట్ లో మిగిలిన పధకాలు ఎలా ఉన్నా ఇది మాత్రం చక్కని పధకమని అంటున్నారు. దీనిని కనుక ఏపీలో అమలు చేస్తే దేశంలో అనేక రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News