ఏపీ పొలిటికల్ పిక్చర్ ఫుల్ క్లారిటీ వస్తుందా ?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన దాదాపు పది నెలల తరువాత జరుగుతున్న ఎన్నికలుగా ఎమ్మెల్సీ ఎన్నికలను చూడాల్సి ఉంది.

Update: 2025-02-27 03:55 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన దాదాపు పది నెలల తరువాత జరుగుతున్న ఎన్నికలుగా ఎమ్మెల్సీ ఎన్నికలను చూడాల్సి ఉంది. రెండు పట్టభద్రుల స్థానాలు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంతో మొదలెడితే అటు కోస్తాలోని క్రిష్ణా జిల్లా దాకా ఉన్న దాదాపు 101 అసెంబ్లీ సీట్లను కవర్ చేసే ఎన్నికలుగా వీటిని చూడాల్సి ఉంది.

ఇక గత ఎన్నికల్లో చూస్తే కూటమికి పెద్ద ఎత్తున యువత పట్టభద్రులు విద్యావంతులు సపోర్టు చేశారు. ఈ మద్దతు నూటికి తొంబై శాతం పైగానే అని ఎన్నికల ఫలితాలు వచ్చిన ఓట్లూ నిరూపించాయి. అలాగే ఉపాధ్యాయులు కూడా అత్యధిక శాతం కూటమి సర్కార్ రావాలని బలంగా కోరుకుని మద్దతు ఇచ్చారు. ఇపుడు ఈ కీలక వర్గాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నాయి.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపుగా 22 వేల పై చిలుకు టీచర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం ద్వారా తమ మనోభావాలను వ్యక్తం చేస్తారు. అదే విధంగా గోదావరి క్రిష్ణా గుంటూరులలో ఉన్న పట్టభద్రులు విద్యావంతులు తమ ఓటు హక్కుని గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వినియోగించుకోవడం ద్వారా తొమ్మిది నెలల కూటమి పాలన మీద తమ భావనను వ్యక్తం చేస్తారు.

సాధారణంగా ఎన్నికలు లేని వేళ ర్యాండం చెకప్ గా కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు సర్వేలు చేస్తూ ఉంటాయి. ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అని అభిప్రాయ సేకరణ చేస్తూ ఉంటాయి. అయితే అవన్నీ పరిమితమైన శాంపిల్స్ తోనే సాగుతోంది. పూర్తిగా ప్రజల మూడ్ అన్నది వ్యక్తం కాకపోవచ్చు. కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం అలా కాదు.

పూర్తిగా వేలాది ఓటర్లు ఉన్నారు. వారంతా సమాజంలో జరిగే ప్రతీ పరిణామాన్ని గమనిస్తూ తమదైన శైలిలో విశ్లేషించే సత్తా ఉన్న వారు. అందువల్ల వీరు వేసే ఓట్లు ఇచ్చే తీర్పు స్పష్టంగా ఏపీలో రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది అని అంటున్నారు. అంతే కాదు కూటమి ప్రభుత్వానికి ఒక విధంగా ఈ ఫలితాలు దిశా నిర్దేశం చేసేలా ఉంటాయని అంటున్నారు.

ఈ ఎన్నికల్లో కూటమి తరఫున టీడీపీ రెండు సీట్లలో పోటీలో ఉంది. ఉత్తరాంధ్రాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీకి మద్దతు ఇస్తోంది. ఈ మూడు సీట్లూ కూటమి గెలుచుకుంటే తిరుగులేదని భావించవచ్చు. ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలిగితే అపుడు సీరియస్ గానే ఆలోచించుకోవాల్సి ఉంటుంది.

అంతే కాదు ఓటింగ్ ఎలా జరిగింది ఎక్కువ ఓట్లు ఎవరికి పోల్ అయ్యాయి అన్నది కూడా క్రెడిటేరియాగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతిమంగా గెలుపు అన్నది దక్కినా అందులో కూడా లోతైన విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. అపుడే ఈ ఫలితాలు అర్ధమవుతాయి. ఏది ఏమైనా సరే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం కూటమి ప్రభుత్వం పనితీరు మీద ఎంతో కొంత ఇచ్చే తీర్పుగానే చూడాలని అంటున్నారు. అలాగే ఏపీలో పొలిటికల్ పిక్చర్ ఎలా ఉంది. మార్పు ఉందా లేదా ఒకవేళ ఉంటే ఏ మేరకు ఏ వర్గాలలో అన్నది కూడా స్పష్టమవుతుంది. అందువల్ల ఈ ఎన్నికల ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆషామాషీ అయితే కావనే అంటున్నారు. చూడాలి మరి ఏ రకంగా రిజల్ట్స్ ఉంటాయో.

Tags:    

Similar News