ఏపీ సీఎం కి తెలంగాణా సీఎం సమాచారం ఇచ్చారా...ఇలా అయితే ఎలా ?
ఇపుడు ఆయన మంత్రిగా ఉన్నారు. కీలకమైన శాఖలు చేతిలో ఉన్నాయి. దాంతో ఆయన హవా తుఫాను జోరుతో సాగుతోంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 5 Jan 2025 4:13 PM GMTఆదివారం రోజంతా ఒక హాట్ పొలిటికల్ టాపిక్ మీదనే నడచింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇంత పెద్దగా ఒక ఇష్యూ టీడీపీ అనుకూల మీడియాలో కూడా ప్రచారం కావడం అన్నది నిజంగా సెన్సేషనల్ అని అంటున్నారు.
ఇంతకీ అంతలా బ్లాస్టింగ్ న్యూస్ గా మారిన ఆ ఇష్యూ ఏంటి అంటే చాలానే కధ ఉంది అంటున్నారు. ఏపీలో కూటమి కేబినెట్ లో 24 మంత్రులు ఉంటే పొలిటికల్ గా హైలెట్ అవుతూ అతి పెద్ద ఇష్యూగా మారిన సదరు మంత్రి గారి స్టైలే వేరు అని అంటున్నారు. ఆయన గారి గురించిన కధా కమామీషూ చాలానే ఉంది అని అంటున్నారు.
అనగా అనగా ఏపీలో ఒక మంత్రి గారట. ఆయనకు సొంత స్టేట్ లో కంటే పొరుగు స్టేట్ లోనే పని ఎక్కువట. ఆయన వారంలో మూడు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉంటూ తన శాఖకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ చక్కబెడుతున్నారుట.
మరి ఆయన సీనియర్ మోస్ట్ మంత్రినా అంటే కానే కాదట. ఆయన ఏపీలో తొలిసారి మంత్రి పదవిని దక్కించుకున్నారు అని అంటున్నారు. ఆయన హైదరాబాద్ లో కూర్చుని జోరుగా సెటిల్మెంట్లు చేస్తున్నారు అన్నది మీడియాలో కోడై కూస్తున్న వ్యవహారంగా ఉంది.
ఇక ఆయన గారి వ్యవహారాలు హద్దులు దాటుతున్నాయని జర జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ తెలంగాణా ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ పెద్దలను అప్రమత్తం చేసిందని అంటున్నారు. ఆయన ఏపీ వ్యవహారాలే కాకుండా తెలంగాణా భూముల వ్యవహారాలను కూడా చక చకా చక్కబెట్టేస్తున్నారని కూడా కీలకమైన ఆరోపణలతో కూడిన సమాచారాని టీ సర్కార్ పెద్దలు ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారని అంటున్నారు.
ఆయనను అదుపులో ఉంచాలని కూడా కోరినట్లుగా చెబుతున్నారు. ఆయన హైదరాబాద్ లో బిజీ బిజీగా చేస్తున్న పంచాయతీలకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఇచ్చినట్లుగా పేర్కొంటున్నారు. ఇక కీలకమైన పదవిలో ఆయన ఆయన చక్రం గిర్రున తిప్పేస్తున్నారు అని అంటున్నారు. హైదరాబాద్ వస్తే చాలు ఒక స్టార్ హొటల్ లో మకాం వేసి అక్కడే ఆల్ సెటిల్మెంట్స్ ని చేసేస్తున్నారు అని అంటున్నారు.
లోతుల్లోకి వెళ్తే సదరు మంత్రిగారు రోజంతా కూడా సెటిల్మెంట్లలోనే బిజీగా ఉంటూ వస్తున్నారట. ఇంకాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆయనకు ఈ సెటిల్మెంట్లు వైగైరాలు అన్నీ చాలా పాతవేనని ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచీ ఇదే తంతు అని అంటున్నారు.
ఇపుడు ఆయన మంత్రిగా ఉన్నారు. కీలకమైన శాఖలు చేతిలో ఉన్నాయి. దాంతో ఆయన హవా తుఫాను జోరుతో సాగుతోంది అని అంటున్నారు. ఆ మంత్రిగారితో పని ఉన్న వారంతా హైదరాబాద్ లో ఆయన విడిది చేసిన చోటన క్యూలు కట్టేస్తున్నారట. తమ విన్నపాలు వినిపించుకుని ఆయన కరుణా కటాక్షాలు దక్కించుకుని బయటపడాలని తపన పడుతున్నారట.
ఇలా వీర లెవెల్ లో సాగుతున్న మంత్రి గారు స్పీడ్ గురించి మొత్తం మ్యాటర్ ని రాబట్టిన తెలంగాణా సర్కార్ దానికి చాలా జాగ్రత్తగా ఏపీ ప్రభుత్వ పెద్దలకు చేరవేసిందని అంటున్నారు. ఇక బ్రేకులు వేయాల్సింది మీరే సుమా అంటూ చిన్నపాటి అలెర్ట్ తో కూడా సమాచారాన్నే పంపించింది అని అంటున్నారు.
చంద్రబాబు ఏపీలో నాలుగో సారి సీఎం గా ఉన్నారు. ఆయన మంత్రివర్గంలో అంతా క్రమశిక్షణగా ఉండాలని దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఆయన అందరి మీద ఫుల్ ఫోకస్ తో ఉంటారు అని కూడా చెబుతారు. కానీ మరీ ఇలా ఒక మంత్రి గారు పక్క రాష్ట్రంలో జోరెత్తిస్తూంటే ఈ మ్యాటర్ మొత్తం వారికి తెలిసి ఏపీ ప్రభుత్వ పెద్దలను అలెర్ట్ చేసే దాకా సీన్ వెళ్లిందంటే ఏమిటి ఇదంతా అని అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా అయితే ఎలా అన్న చర్చ కూడా సాగుతోంది. ప్రభుత్వం ఇమేజ్ అన్నది మంత్రుల పనితీరు మీదనే ఆధారపడి ఉంటుందని పదే పదే చెబుతూ వస్తున్న కూటమి పెద్దలకు సదరు మంత్రి గారి నిర్వాకం నిజంగానే ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. మరి ఆయన మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అన్నదే ఇపుడు కీలకమైన ప్రశ్నగా ముందుకు వస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.