ఏపీకి కొత్త డీజీపీ ఆయనేనా ?

ఏ ప్రభుత్వంలోనైనా డీజీపీ పోస్టుకు ఎంతో విలువ ఉంటుంది. ప్రభుత్వం అంటే కీలక అంగాలుగా రెవిన్యూ పోలీస్ ఉంటారు.;

Update: 2025-04-08 07:05 GMT
Madireddy Prathap Emerges Next Dgp In Andhra Pradesh

ఏ ప్రభుత్వంలో నైనా డీజీపీ పోస్టుకు ఎంతో విలువ ఉంటుంది. ప్రభుత్వం అంటే కీలక అంగాలుగా రెవిన్యూ పోలీస్ ఉంటారు. అందుకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉన్నారు అన్నది చూస్తారు అలాగే డీజీపీగా ఎవరు ఉన్నారు అన్నది కూడా ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు.

లా అండ్ ఆర్డర్ అన్నది ప్రభుత్వం ప్రధాన విధులలో ఒకటి. అందువల్ల ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో డీజీపీని ఎన్నో ఆలోచించి ఎంపిక చేస్తుంది. ఇక డీజీపీ కానీ ఇతర పోస్టుల విషయంలో సీనియారిటీని చూడాలన్నది ఒక ప్రోటోకాల్. కానీ ప్రభుత్వ అధినేతలు ఏమి అనుకుంటే అదే జరుగుతుంది. అలా సీనియారిటీని తప్పించి తమకు కావాల్సిన వారిని నియమించుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా ఈ ఏడాది ఆగస్ట్ 2న పదవీ విరమణ చేయనున్నారు. దాంతో కొత్త డీజీపీ ఎవరు అన్న చర్చ తెర మీదకు వస్తోంది. డీజీపీ పోస్టు కోసం చూస్తే సీనియారిటీ ప్రకారం చాలా మంది లిస్ట్ లో ఉన్నారు

ఏకంగా 12 మంది దాకా సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఈ జాబితాలో ఉన్నారని అంటున్నారు 1991 బ్యాచ్ కి చెందిన మాదిరెడ్డి ప్రతాప్ ఈ విషయంలో అగ్ర స్థానంలో ఉన్నారు. అలాగే 1992 బ్యాచ్ కి చెందిన పీఎస్అర్ ఆంజనేయులు, కేవీఆర్ ఎన్ రాజేంద్రనాధ్ రెడ్డి, నళినీ ప్రభాత్ ఉన్నారు. మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్ 1993 బ్యాచ్ కి చెందిన వారుగా ఉన్నారు. ఇక పీవీ సునీల్ కుమార్, విశ్వజిత్, రవిశంకర్ అయ్యనార్, బాలసుబ్రమణ్యం, కృపానంద్ త్రిపాఠీ 1994 బ్యాచ్ లో ఉన్నారు.

ఇక చూస్తే హరీష్ కుమార్ గుప్తాకు ఎక్స్ టెన్షన్ ఉండకపోవచ్చు అని అంటున్నారు దాంతో ఈ పేర్లలో సీనియారిటీని జాబితాను రెడీ చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిస్తుంది అని అంటున్నారు. అలాగే షార్ట్ లిస్ట్ గా ముగ్గురు పేర్లతో కేంద్రానికి పంపిస్తే అందులో నుంచి ఒకరి పేరుని కేంద్రం ఎంపిక చేస్తుంది. వారే ఏపీకి కొత్త డీజీపీ అవుతారు అని అంటున్నారు.

అయితే ప్రభుత్వం సీనియారిటీ ప్రోటోకాల్ ని అనుసరించి షార్ట్ లిస్ట్ తయారు చేస్తుందా లేక అది పక్కన పెట్టి లిస్ట్ ప్రిపేర్ చేస్తుందా అన్నది చర్చగా ఉంది గతంలో జగన్ సర్కార్ సీనియారిటీ లిస్ట్ పక్కన పెట్టి రాజేంద్రనాధ్ రెడ్డికి డీజీపీ బాధ్యతలు అప్పగించింది.

అయితే సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటే అందరిలో సీనియర్ మోస్ట్ అయిన మాదిరెడ్డి ప్రతాప్ పేరు వినిపిస్తోంది. 1991 బ్యాచ్ కి చెందీ ఆయన 2026 జూలై 1న పదవీ విరమణ చేస్తారు. దాంతో పాటు ఆయన సమర్ధత అనుభవం పరిగణనలోకి తీసుకుంటే ఆయనే కొత్త డీజీపీగా అయితే బాగుంటుంది అని అంటున్నారు. మంచి పాలనకు క్రమశిక్షణకు సంకేతంగా ఆయన నియామకం ఉంటుందని పోలీస్ వర్గాలలో సైతం వినిపిస్తోంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది అయితే మాదిరెడ్డి ప్రాతప్ కే ఎక్కువ చాన్స్ ఉందని అంటున్నారు.

Tags:    

Similar News