ఏపీ నుంచి సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ కి బిగ్ అలర్ట్!
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశాడనే ఆరోపణలపై అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్ లు, లాటరీ ప్రోగ్రామ్ లను ప్రోత్సహించే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ ల సంఖ్య గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే! వీరి వీరి ఖాతాల్లో వాటిని ప్రమోట్ చేయడంతో పాటు.. ఆయా యాప్ లకు చెందిన ప్రమోషనల్ వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. ఈ సమయంలో ఏపీ పోలీసులు స్ట్రిక్ట్ గా రియాక్ట్ అవుతున్నారు.
అవును... బెట్టింగ్ యాప్ లు, లాటరీ ప్రోగ్రామ్ లను ప్రోత్సహించే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ లపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు! ఇటీవల విశాఖకు చెందిన యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ వాసుపల్లి నాని అలియాస్ లోకల్ బాయ్ నానీని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశాడనే ఆరోపణలపై అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాను ఓ ఫ్లాట్ ఫామ్ లో గేమ్స్ ఆడుతూ సంపాదిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయితే నానీ వీడియో చూసి బెట్టింగ్ యాప్స్ తో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు.. అతడిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదే సమయంలో.. ఈ వ్యవహారంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా స్పందించారు. నాని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వీడియోలను తొలగించాలని ఆదేశించారు. దీంతో... ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా బలమైన చర్చ మొదలైంది. బెట్టింగ్ సంస్కృతిని అరికట్టడానికి పోలీసుల కృషిపై ప్రశంసలు వచ్చాయి!
ఇదే సమయంలో తాజాగా విజయవాడ పోలీసులు కూడా ఒక పబ్లిక్ నోటీసు జారీ చేశారు! ఇందులో భాగంగా... సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు బెట్టింగ్ ను ప్రోత్సహించకుండా ఉండాలని హెచ్చరిస్తోంది! ప్రధానంగా ఐపీఎల్ సీజన్ కూడా రానుండటంతో సాధారణ ప్రజలు తీవ్ర ప్రభావితమవుతున్న తరుణంలో.. ఏపీ పోలీసులు ఈ విషయంపై మరింత స్ట్రిక్ట్ గా ఉన్నారని అంటున్నారు.