లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటే... పవన్ సీఎం అవ్వాల్సిందేనా..?
దీనిపై తాజాగా జనసేన నేతలు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా స్పందించిన కిరణ్ రాయల్.. ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ తరుపున నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రి చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించారని అంటున్నారు.
అనంతరం పలువురు టీడీపీ నేతలు ఈ ప్రతిపాదనను బలపరుస్తూ మీడియా ముందు స్పందిస్తున్నారు.. సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు టీడీపీ భవిష్యత్తుపై కార్యకర్తలకు సరైన క్లారిటీ ఇచ్చే క్రమంలో నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలని పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు స్పందిస్తున్నారు.
ఇందులో భాగంగా... తెలుగుదేశం పార్టీ తరుపున ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ను ఎంపిక చేయాలని.. జగన్ సీఎం కావాలని, పవన్ కల్యాణ్ కూడా సీఎం కావాలని ఆయా పార్టీల కార్యకర్తలు ఎలాగైతే కోరుకుంటారో.. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కూడా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని పిఠాపురం టీడీపీ నేత వర్మ చెబుతున్నారు.
దీంతో... ఈ విషయం ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారింది. అయితే... ఇదంతా పవన్ కు చెక్ పెట్టడానికి చంద్రబాబు చేస్తున్న వ్యూహాల్లో భాగం అనే కామెంట్లు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయని అంటున్నారు. దీనిపై తాజాగా జనసేన నేతలు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా స్పందించిన కిరణ్ రాయల్.. ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీలోని కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ తరుపున ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ను ఎంపిక చేయాలనే ప్రతిపాదన తెరపైకి రావడంతో.. టీడీపీ నేతలు ఈ ప్రతిపాదనకు బలం చేకూరుస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సమయంలో స్పందించిన జనసేన నేత కిరణ్ రాయల్... కడప జనసేన నుంచి సరికొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.
ఇందులో భాగంగా... కడప జనసేన తరుపున తాము కూడా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని.. నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవ్వాలని.. చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలని తాము కూడా అనుకుంటున్నట్లు తెలిపారు. ఆ విధంగా చంద్రబాబు కేంద్రంలో.. పవన్ సీఎంగా.. లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని తమకోరిక అని అన్నారు. దీంతో... ఈ ప్రతిపాదన వైరల్ గా మారుతోంది!