ఈడీ దూకుడు... స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం!

తాజాగా మరోసారి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-10-15 14:57 GMT

ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎంత సంచలనమైన విషయమే సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో సంచలనాలు ఈ కేసు విషయంలో తెరపైకి వచ్చాయి. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా మరోసారి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

అవును... ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీమెన్స్ ప్రాజెక్ట్ లో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోనల్ ఆఫీస్ రూ.23.54 కోట్ల ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది!

ఏపీ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఈ ప్రాజెక్ట్ ఉద్దేశించబడింది. డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులపై ఏ.పీ.ఎస్.ఎస్.డీ.సీ. సీమెన్స్ ప్రాజెక్ట్ కేసులో రాష్ట్రం పెట్టుబడి పెట్టిన నిధులను దారి మళ్లించడం, స్వాహా చేయడం ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఆరోపణలు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే.

ఈ ఆరోపణలపైనే ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ ఎఫ్.ఐ.ఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సౌమ్యాద్రి శేఖర్ బోస్, వారి సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ మొదలైన వారి సహాయంతో ప్రభుత్వం నిధులను మళ్లించారని ఈడీ దర్యాప్తులో వెల్లడైనట్లు చెబుతున్నారు!

Tags:    

Similar News