బాబు...రేవంత్ : ఇద్దరూ ఒకేసారి సీరియస్ గా క్లాస్ !

ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ప్రజలకు చెప్పలి అదే సమయంలో వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాలని బాబు గట్టిగానే చెప్పారని అంటున్నారు.;

Update: 2025-04-15 14:12 GMT
బాబు...రేవంత్  :  ఇద్దరూ  ఒకేసారి సీరియస్ గా క్లాస్ !

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే సమయంలో కీలక సమావేశాలు నిర్వహించారు. బాబు అయితే మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు సీరియస్ గానే క్లాస్ తీసుకున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మంత్రులు ఎవరూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.

ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ప్రజలకు చెప్పలి అదే సమయంలో వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాలని బాబు గట్టిగానే చెప్పారని అంటున్నారు. వైసీపీ పెద్ద ఎత్తున అసత్యాలు ప్రచారం చేస్తోంది అసలు నిజాలు జనాలకు మంత్రులు చెప్పకపోతే ఎలా అని బాబు అన్నట్లుగా చెబుతున్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను ఏపీలో అమలు చేస్తూంటే మంత్రులు వాటిని జనంలోకి తీసుకుని వెళ్ళడంలో విఫలం అవుతున్నారని బాబు అన్నట్లుగా భోగట్టా. మంత్రులు ఎమ్మెల్యేలతో అలాగే ఆయా జిల్లాలలోని కూటమిలోని మిగిలిన పార్టీలతో కో ఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలని కూడా అన్నట్లుగా చెబుతున్నారు.

ఇక తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ మీటింగులో మాట్లాడారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో ఇదే తీరున మాట్లాడారు అని అంటున్నారు. ప్రభుత్వం మీద వచ్చే విమర్శలను పెద్దగా తిప్పికొట్టడం లేదని అన్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి బలమైన వాయిస్ ఉండాలని ఆయన అన్నట్లుగా చెబుతున్నారు.

ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పర్యటించాలని రెండోసారి వరసగా గెలవడానికి అవసరం అయిన కార్యక్రమాలను చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు అని అంటున్నారు. ఇప్పటి నుంచి ప్రజలలో ఉంటే వరసగా రెండోసారి గెలవడానికి వీలు అవుతుందని ఆయన అన్నట్లుగా చెబుతున్నారు.

ఇక ప్రతీ ఎమ్మెల్యే జీతం నుంచి పార్టీ ఫండ్ గా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే అటు బాబు తన పార్టీ మంత్రుల మీద సీరియస్ అయిన సమయంలోనే ఎమ్మెల్యేల మీద రేవంత్ రెడ్డి కొంత సీరియస్ గానే క్లాస్ తీసుకున్నారని అంటున్నారు.

ఈ ఇద్దరూ కూడా పార్టీ గురించి ప్రభుత్వం గురించి తమ వారికి మరింత బాధ్యత పెరిగేలా చేసేందుకే ఈ రకంగా వ్యవహరించారు అని అంటున్నారు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు ఇద్దరు ప్రభుత్వాధినేతలు తమ వారికి ఒకింత గట్టిగానే దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. వాటి ఫలితాలు ఎలా వస్తాయో ముందు ముందు చూడాల్సి ఉంది.

Tags:    

Similar News