ఏపీ ఎన్నికలకు మార్చిలోనే నోటిఫికేషన్ కన్ఫర్మ్ ...!

ఏపీలో ఎపుడు ఎన్నికలు జరుగుతాయి అన్న చర్చలు తెర లేస్తోంది. చూస్తూండగానే 2023 చరిత్ర పుటలలోకి వెళ్ళిపోతోంది.

Update: 2023-12-11 00:30 GMT

ఏపీలో ఎపుడు ఎన్నికలు జరుగుతాయి అన్న చర్చలు తెర లేస్తోంది. చూస్తూండగానే 2023 చరిత్ర పుటలలోకి వెళ్ళిపోతోంది. 2024 మరి కొద్ది రోజులలో మొదలవుతోంది. 2024 వచ్చింది అంటే ఎన్నికల ఏడాదిలో అడుగు పెట్టినట్లే. 2019 ఎన్నికల్లో కూడా ఇలాంటి వాడి వేడి కనిపించింది. ఇదిలా ఉంటే ఎపుడెపుడు ఎన్నికలు అని రాజకీయ పక్షాలు అంతా ఎదురుచూస్తున్న నేపధ్యం ఉంది.

మరో మూడు నెలలు అని అంతా ఒక అంచనాతో మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా చూస్తే ఇంటర్ టెన్త్ పరీక్షలు ఈసారి ఏకంగా పదిహేను రోజులు ముందే నిర్వహిస్తున్నారు. గత ఏడాది మార్చి 15 తరువాత ఇంటర్ ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ నిర్వహించారు. కానీ ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మార్చి ఫస్ట్ నుంచే నిర్వహించాలనుకుంటున్నట్లుగా అధికార వర్గాల నుంచి ప్రచారం సాగుతోంది. వాటిని మార్చి 20తో ముగించనున్నారు.

అదే విధంగా టెన్త్ పరీక్షలు మార్చి 21 నుంచి మొదలెట్టి ఆ నెలాఖరుతో ముగించనున్నారు. దీంతో ఈ పరీక్షలు ముందుకు జరగడం అంటే ఎన్నికల షెడ్యూల్ కోసమే అని అంటున్నారు. మార్చి లో ఏపీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అవుతుంది అని అంటున్నారు. దానికి ప్రిపరేషన్ గానే ఈ పరీక్షల షెడ్యూల్ మార్పు అని అంటున్నారు.

ఒక సారి 2019 ఎన్నికల గురించి చూసుకుంటే ఆనాడు భారత ఎన్నికల సంఘం మార్చి 10న ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ని ప్రకటించింది. ఆ తరువాత వారం అంటే మార్చి 18న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక 2019 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరిగాయి. ఆ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మార్చి 18 న ప్రారంభించారు. ఓట్ల లెక్కింపు మే 23న చేపట్టారు.

ఇలా గత ఎన్నికల షెడ్యూల్ ఉంది. అపుడు కూడా లోక్ సభ ఎన్నికలతో ఏపీ ఎన్నికలను కలిపి నిర్వహించారు. దాన్ని రెండు నెలల పాటు ఏకబిగిన ఎన్నికలు దేశవ్యాప్తంగా సాగాయి. ఏపీలో అయితే దాదాపుగా మూడు నెలల పాటు ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈసారి కూడా ఏపీ నుంచే ఎన్నికలు తొలిదశగా లోక్ సభకు నిర్వహిస్తూ దాంతో పాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు అని అంటున్నారు

సో అలా చూసుకుంటే మార్చిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి అదే నెలలో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. ఎటు నుంచి ఎలా చూసుకున్నా ఇదే కన్ఫర్మ్ అని అంటున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి కచ్చితంగా చేతిలో ఉన్నది కచ్చితంగా తొంబై రోజులు మాత్రమే అంటున్నారు. సో ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది అన్న మాట. ఈ విలువైన సమయంలో ప్రభుత్వం ఏమి చేయాలనుకున్నా చేయడానికి మిగిలింది అని అంటున్నారు.

Tags:    

Similar News