ఇంట్రెస్టింగ్ : 17 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు..!

దీనిపై చంద్ర‌బాబు రెండో సంత‌కం చేస్తున్న ద‌రిమిలా.. సంబంధిత చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకుంటున్నారు.

Update: 2024-06-11 09:21 GMT

ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్‌లో తొలిరోజు ఎంఎల్యేల ప్రమాణ స్వీకారం, రెండోరోజు స్పీకర్ ఎన్నిక ఉండనుం ది. ఇక ఈ సెషన్‌లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై చంద్ర‌బాబు రెండో సంత‌కం చేస్తున్న ద‌రిమిలా.. సంబంధిత చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకుంటున్నారు.

ప్ర‌మాణం అనంతరం..

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బుధ‌వారం ప్రమాణస్వీకారం చేసిన అనం తరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లనున్నారు. బుధవారం(12వ తేదీ) చంద్రబాబు సీఎంగా ప్రమా ణం చేస్తారు. అదే రోజు రాత్రికి ఆయన తిరుమలకు బయలు దేరతారు. ఆ రాత్రి తిరుమలలో బస చేసి 13వ తేదీ గురువారం ఉదయం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు.

ఏర్పాట్లు పూర్తి!

ఏపీ నూత‌న‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బుధవారం(12వ తేదీ) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు దాదాపు కొలిక్కి వ‌చ్చాయి. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్ ప‌క్కన జరుగుతున్న పనులను టీడీపీ నేతలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వేదిక ఏర్పాటు పూర్త‌యింది. జర్మన్‌ హ్యాంగర్స్‌తో భారీఎత్తున దీనిని ఏర్పాటు చేశారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో దీనిని సిద్ధం చేశారు.

సీఎం చీఫ్ సెక్రటరీగా ముద్దాడ రవిచంద్ర

ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం సవిరిగాం గ్రామాని కి చెందిన ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రకు అరుదైన అవకాశం లభించింది. ఆయ‌న‌ను ముఖ్య మంత్రి చీఫ్ సెక్రటరీగా, సీఎంఓ కార్యాలయం చీఫ్ గా నియమించారు. ముఖ్యమంత్రిగా నారా చంద్ర బాబు నాయుడు పదవీ స్వీకారం చేసిన అనంతరం ముద్దాడ ర‌విచంద్ర బాధ్యతలు స్వీకరిస్తారు.

Tags:    

Similar News