ఇదంతా.. పవన్‌ కు తెలిసే జరుగుతోందా?

ఈ మూడు పార్టీల కూటమి అఖండ విజయం సాధించి ఏకంగా 175కు 164 స్థానాలను గెలుచుకుంది. వై నాట్‌ 175 అన్న వైసీపీ కేవలం 11 స్థానాలకే కుదేలైంది.

Update: 2024-07-01 10:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు పార్టీల కూటమి అఖండ విజయం సాధించి ఏకంగా 175కు 164 స్థానాలను గెలుచుకుంది. వై నాట్‌ 175 అన్న వైసీపీ కేవలం 11 స్థానాలకే కుదేలైంది.

ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు 88. జనసేన, బీజేపీ గెల్చుకున్న స్థానాలతో సంబంధం లేకుండానే టీడీపీ సొంతంగా ఈ మెజార్టీ మార్కును అందుకుంది. టీడీపీ 135 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వమనే అంటున్నారు. టీడీపీ ప్రభుత్వమని అనడం లేదు. అలాగే ప్రభుత్వంలో మూడు పార్టీలవారు మంత్రులుగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో మీడియాకు ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనల్లో కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోను మాత్రమే ప్రచురిస్తున్నారు, అది కూడా చాలా పెద్దగా. ఎన్నికల ముందు మేనిఫెస్టోను కూడా టీడీపీ, జనసేన ఉమ్మడిగా విడుదల చేశాయి. ఉమ్మడి మేనిఫెస్టో అని పేర్కొన్నాయి. బీజేపీ కూడా ఈ మేనిఫెస్టోకు అంగీకారం తెలిపిందని నాడు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. అంటే ప్రభుత్వం చేసే పనులకు సంబంధించి మూడు పార్టీలకు సమాన భాగస్వామ్యం ఉంటుంది. అలా వైఫల్యాలకు కూడా.

అయితే ఇటీవల ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పత్రికలకు పుల్‌ పేజీ యాడ్స్‌ ను చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది. అయితే అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోను మాత్రమే ముద్రించడం చర్చకు దారితీసింది. ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నప్పుడు జన సేనాని పవన్‌ కళ్యాణ్, బీజేపీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో కూడా వేయాలిగా అనే ప్రశ్నలు ఉదయించాయి.

ముఖ్యంగా బీజేపీని పక్కనపెట్టినా కూటమి ఏర్పాటులో, ఘనవిజయంలో కీలక పాత్ర పోషించిన పవన్‌ కళ్యాణ్‌ ఫొటో యాడ్స్‌ లో లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. అందులోనూ పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అలాంటిది పవన్‌ ఫొటో లేకపోవడం సహజంగానే జనసేన పార్టీ శ్రేణులతోపాటు సాధారణ ప్రజల్లోనూ చర్చకు తావిచ్చింది.

రామోజీ సంస్మరణ దినం సందర్భంగా ఇచ్చిన యాడ్‌ ఏదో పొరపాటు జరిగిందనుకున్నా.. తాజాగా పెంచిన పింఛన్ల పంపిణీ సందర్భంగా పత్రికలకు ఫుల్‌ పేజీ యాడ్లను ప్రభుత్వం ఇచ్చింది. ఇందులోనూ కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో మాత్రమే ఉంది. పవన్‌ కళ్యాణ్‌ ఫొటో సంగతి దేవుడెరుగు.. కనీసం ఆయన పేరు కూడా లేదు. దీన్నిబట్టి రామోజీ సంస్మరణ దినంగా ఇచ్చిన యాడ్‌ లో పొరపాటు ఏమీ లేదని.. ఉద్దేశపూర్వకంగానే పవన్‌ ఫొటో లేకుండానే ఇచ్చారని అంటున్నారు. తాజాగా పెన్షన్‌ యాడ్‌ సందర్భంగా ఇచ్చిన యాడ్‌ తో ఇది రుజువు అయిందని అంటున్నారు.

వాస్తవానికి పింఛన్ల పింపిణీ.. పంచాయతీరాజ్‌ పరిధిలోకే వస్తుంది. ఈ శాఖ కూడా పవన్‌ కళ్యాణ్‌ చేతిలోనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన యాడ్స్‌ లో పవన్‌ కళ్యాణ్‌ ఫొటో లేకపోవడం హాట్‌ టాపిక్‌ గా మారింది. దీన్ని బట్టి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో కేవలం చంద్రబాబు ఫొటో మాత్రమే ఉంటుందని స్పష్టం చేసిన టై్టంది.

మరి ఈ విషయం పవన్‌ దృష్టికి వెళ్లిందా.. వెళ్లలేదా.. అనేది తెలియాల్సి ఉంది. పవన్‌ దృష్టికి వెళ్తే ఆయన ఈ విషయంలో ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News