ఏపీ గవర్నర్ ప్రసంగంలోని కీలక అంశాలు... తెరపైకి హైదరాబాద్ టాపిక్!

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.

Update: 2024-07-22 07:42 GMT

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా 2014-19 మధ్య రాష్ట్రాభివృద్ధి దిశగా వేగంగా అడుగులుపడ్డాయని.. అదే సమయంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగిందని అన్నారు. ఈ సమయంలోనే రాష్ట్ర విభజన, హైదరాబాద్ ని కోల్పోవడంపై స్పందించారు.

అవును... ఈ రోజు నుంచి ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్... విభజన వల్ల ఏపీకి నష్టం కలిగిందని అన్నారు. ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయని.. రాజధాని హైదరాబాద్ ను కోల్పోవడం వల్ల నష్టం ఎక్కువగా కలిగిందని అన్నారు.

అయితే.. విభజన అనంతరం 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ అభివృద్ధి దిశగా అడుగులు వేయడంతోపాటు.. రాజధాని నిర్మాణానికి తీవ్రంగా కృషిచేశారని అన్నారు. ఇదే క్రమంలో... చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగగా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని, అన్ని రంగాలు నష్టపోయాయని తెలిపారు.

ఇదే సమయంలో చంద్రబాబు హయాంలో పోలవరాన్ని 75శాతానికి పైగా పూర్తి చేసినట్లు తెలిపిన గవర్నర్... జగన్ పాలనలో రివర్స్ టెండరింగ్ పే రుతో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం చేకూర్చారని అన్నారు. ఇక వైసీపీ పాలనలో ప్రాజెక్టులపై మూలధన వ్యయం 56 శాతం తగ్గించారని.. రోడ్లు, భవనాల వ్యయాన్ని 80శాతానికి పైగా తగ్గించేశారని అన్నారు.

ఈ సమయంలోనే అమరావతి కలను చెదరగొట్టడానికి డీసెంట్రలైజేషన్ పేరుచెప్పి మూడు రాజధానులన్నారని అన్నారు. ఈ క్రమంలోనే గత ఐదేళ్లలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని తెలిపారు. మూడు రాజధానుల పేరుతో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ పరిస్థితులను ఏపీ ప్రజలకు వివరించడానికి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా...

ఇక 2018 నాటికి ఇంధన మిగులు రాష్ట్రంగా ఏపీ ఉండగా.. 2019 - 24 మధ్య ఇంధన రంగానికి రూ. 1,29,503 కోట్ల నష్టం వచ్చినట్లు గవర్నర్ తెలిపారు. ఇదే సమయంలో... ఇసుక, ఖనిజ సంపదను కొల్లగొట్టడం వల్ల రూ.19వేల కోట్ల నష్టం రాగా.. అస్తవ్యస్త ఇసుక విధానం వల్ల 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు.

ఇదే క్రమంలో నాణ్యత లేని మద్యం, గుర్తింపులేని బ్రాండ్లు తీసుకొచ్చి రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయానికి భారీ నష్టం తెచ్చారని తెలిపారు. ఒక్కమాటలో చెప్పాలంటే... వైసీపీ ప్రభుత్వ విధానాలవల్లే రాష్ట్రంలో అభివృద్ధి కుంటిపడిందని గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు.

ఇక ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయడం ప్రారంభించినట్లు చెప్పిన గవర్నర్... ‘సూపర్ సిక్స్’ వాగ్దానాలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీ ని ప్రకటించినట్లు తెలిపిన ఆయన.. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో.. పెన్షన్లు రూ.4వేలకు పెంచినట్లు తెలిపారు.

ఇదే క్రమంలో... అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం ద్వారా పేదలకు ఆహారాన్ని నామమాత్రంగా రూ. 5కే ఇచ్చే చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే 'ఉచిత ఇసుక' సరఫరా వంటి చర్యల్ని ప్రారంభిస్తుందన్నారు. ఈ సమయంలో... సీఎం చంద్రబాబు, పీఎం మోడీ, డిప్యూటీ సీఎం పవన్ నాయకత్వంలో తన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి అన్ని విధాలా కృషి చేస్తుందని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు.

Full View
Tags:    

Similar News