ఈ ఏపీ మంత్రులు మరిపాల కృష్ణులే... మీకు తెలుసా ఆ స్టోరీ..!
అటువంటి మురిపాల కృష్ణులనే తలపిస్తున్నారు కూటమి ప్రభుత్వంలోని మంత్రులు.
మురిపాల కృష్ణుడి గురించి అందరికీ తెలిసిందే. అప్పుడే వేణువు పట్టిన శ్రీకృష్ణుడు.. తన వేణు గానంతో గోపికలనే కాకుండా.. గోవులను కూడా తన వైపు తిప్పుకొని.. వాటిని ఓలలాడించే ప్రక్రియే. ఒక్క ఈ విష యంలోనే కాదు.. తల్లి యశోదా దేవిని మంత్ర ముగ్ధురాలిని చేయడంలోనూ.. తనపై అవ్యాజ అనురాగం పెంచుకునేలా చేసిన మురిపాల కృష్ణుడి లీలలను భగవతంలో చదివి మురిసిపోవాల్సిందే. అలాంటి లీలలే ఏపీ మంత్రులూ చేస్తున్నారు.
అటువంటి మురిపాల కృష్ణులనే తలపిస్తున్నారు కూటమి ప్రభుత్వంలోని మంత్రులు. ముఖ్యంగా తొలి సారి మంత్రి పగ్గాలు చేపట్టిన వారు..తమదైన శైలిలో దూసుకుపోతూ.. యశోద వంటి చంద్రబాబు మనసు ను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు మనసుకు నచ్చేలా.. ఆయన మెచ్చేలా వ్యవహరి స్తూ.. ఆనాడు కృష్ణ లీలలను తలపిస్తున్నారు. పారిశ్రామికంగా.. ఐటీ పరంగా.. ఉపాధి మార్గాల పరంగా అనేక రూపాల్లో మంత్రులు ముఖ్యమంత్రిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్న మంత్రులు మురిపాల కృష్ణులనే తలపిస్తున్నారు. యువ మంత్రులు టీజీ వెంకటేష్, రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు, మహిళా మంత్రులు వంగలపూ డి అనిత, సంజీవరెడ్డిగారి సవిత వంటి వారు.. తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫస్ట్ డే నుంచి ఇటు ప్రజలను అటు ముఖ్యమంత్రిని మురిపించే రీతిలో కార్యక్రమాలకు శ్రీచుట్టారు.
ప్రజాదర్బార్ సహా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో నారా లోకేష్ ముందున్నారు. ఇక, రవాణా శాఖ మంత్రిగా ఉన్న రాంప్రసాద్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. మంత్రి సవిత అయితే.. క్షణం తీరిక లేకుండానే వ్యవహరిస్తున్నారు. గొట్టిపాటి రవి.. ముందుచూపు చాలా బాగుందనే కితాబు తెచ్చిపె ట్టింది. ఇలా తమ దైన పనితీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకర్షించేందుకు.. ఈయన దగ్గర మార్కులు వేయించుకునేందుకు.. మురిపాల కృష్ణుల వంటి మంత్రులు ప్రయత్నించడం గమనార్హం.