రామ్మోహన్ కి పౌర విమానయానం...పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి!

ప్రస్తుతం ఉత్తరాంధ్రాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పొర్టు నిర్మాణం జరుగుతోంది.

Update: 2024-06-10 15:12 GMT

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఏపీ నుంచి ముగ్గురుని మంత్రులుగా తీసుకున్నారు. మొత్తం 72 మంది మంత్రులకు సంబంధిచి శాఖలను తాజాగా ప్రకటించారు. క్యాబినెట్ ర్యాంక్ హోదాతో పౌర విమానయాన శాఖ కింజరాపు రా మ్మోహన్ నాయుడుకు లభించింది. గతంలో ఈ శాఖను ఉత్తరాంధ్రాకే చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు చేపట్టారు. ఆయన నాలుగేళ్ల పాటు ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఇక ఇపుడు అదే శాఖ ఏపీకి మరోసారి వచ్చింది.

ప్రస్తుతం ఉత్తరాంధ్రాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పొర్టు నిర్మాణం జరుగుతోంది. దీనిని వేగవంతంగా పూర్తి చేయడానికి కేంద్ర మంత్రి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. అదే విధంగా ఏపీలో కొన్ని విమానాశ్రయాలను ప్రైవేట్ పరం చేస్తారని ప్రచారం ఉంది. ఆ విషయంలో కేంద్ర మంత్రిగా రామ్మోహన్ చొరవ తీసుకుని అడ్డుకట్ట వేయాల్సి ఉంది.

వీలైతే మరిన్ని విమాన సర్వీసులను విశాఖ విజయవాడలకు అలాగే తిరుపతికి తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇక టైర్ టూ సిటీలలో విమానయాన సదుపాయాలను కలిగించే ప్రయత్నం చేయాలి. ఏపీలో టూరిజం అభివృద్ధి చెందాలన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా విమానయాన రంగం చాలా కీలకం. కాబట్టి యువ మంత్రిగా ఈ రగం మీద రామ్మోహన్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

ఏపీని సన్ రైత్ స్టేట్ గా అభివృద్ధి చేసేందుకు విమానయాన రంగం కీలక పాత్ర పోషిస్తుంది అన్నది వాస్తవం. ఇక గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కి గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. ఈ రెండూ కూడా కీలకమైనవే.

ఏపీలో రూరల్ ఏరియా ఎక్కువ. రూరల్ డెవలప్మెంట్ కోసం పెమ్మసాని చేయాల్సిన కృషి చాలానే ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్స్ శాఖ కూడా ఇంపార్టెంట్. దాంతో ఏపీకి ఉపయోగకరమైన శాఖలే దక్కాయని అంటున్నారు. అలాగే బీజేపీకి చెందిన శ్రీనివాసవర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించడంతో పాటు దానికి సొంత గనులు కేటాయించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఏపీకి తీసుకుని రావడంలో కూడా ఆయన కీలకం అవుతారు అని అంటున్నారు. మొత్తం మీద ఏపీకి కేటాయించిన శాఖలు మంచివే అని అంటున్నారు. మరి మంత్రులు తమ సత్తా చూపించాల్సి ఉంది.

Tags:    

Similar News