‘యాపిల్’ అనుకున్నంత హెల్దీ కాదా?

ప్రపంచంలో అత్యున్నత దిగ్గజ కంపెనీల్లో ఒకటిగా అభివర్ణించే యాపిల్ కు సంబంధించి షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి.

Update: 2024-12-03 14:30 GMT

ప్రపంచంలో అత్యున్నత దిగ్గజ కంపెనీల్లో ఒకటిగా అభివర్ణించే యాపిల్ కు సంబంధించి షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. ఆ సంస్థలో పని చేసే ఉద్యోగి ఒకరు కాలిఫోర్నియాలో కేసు దాఖలు చేసిన వైనం.. అందులో పేర్కొన్న అంశాలు సంచలనంగా మారాయి. చట్టవిరుద్ధంగా యాపిల్ సంస్థ తన ఉద్యోగుల మీద నిఘా వేస్తుందన్న భారీ ఆరోపణ చేశారు. అంతేకాదు.. యాపిల్ సంస్థలో పని చేసే ఉద్యోగులు తమ జీతాలు..వర్కు కల్చర్ కు సంబంధించిన వివరాల్ని ఎక్కడా చర్చించకూడదన్న పరిమితులు పెట్టటమే కాదు.. తమను అడ్డుకుంటున్న వైనాన్ని వెల్లడించారు.

కాలిఫోర్నియాలో అమర్ భక్త అనే ఉద్యోగి యాపిల్ సంస్థపై కేసు దాఖలు చేశారు. కంపెనీ ఉద్యోగుల ఫోన్లు ఇతర పరికరాల్లో సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేస్తుందని.. ఇది ఉద్యోగుల ఈమొయిల్, ఫోటో లైబ్రరీ.. హెల్త్.. స్మార్ట్ హోం డేటా సహా వ్యక్తిగత వివరాల్ని సైతం యాక్సెస్ చేస్తోందని ఆరోపించారు. అంతేకాదు.. యాపిల్ ప్రైవసీ విధానాల్లోనూ నిబంధనల్ని అమలు చేయటాన్ని తప్పు పట్టారు.

యాపిల్ సంస్థ పాలసీల కారణంగా ఆ సంస్థలో పని చేసే ఉద్యోగి మీడియాతో సహా ఎక్కడా తమ పని వాతావరణం గురించి చర్చించకూడదని పేర్కొన్నారు. తాను యాపిల్ సంస్థలో 2020 నుంచి పని చేస్తున్నానని.. తన వర్కు గురించి పాడ్ కాస్ట్ లో మాట్లాడకూడదని కంపెనీ ఆంక్షలు పెట్టినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. లింక్డిన్ లోనూ తన పనికి సంబంధించిన సమాచారాన్ని తొలగించాలన్న నిబంధనలు పెట్టినట్లుగా పేర్కొన్నారు.

యాపిల్ నిఘా పాలసీలు చాలా కఠినంగా ఉంటాయని.. అవి చట్టవిరుద్ధమైనవిగా ఆరోపించారు. ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి.దీంతో.. యాపిల్ సంస్థ స్పందించింది. తాము ప్రపంచంలోనే అత్యున్నతమైన ఉత్పత్తులు.. సేవలు అందించటంపై ఫోకస్ చేశామని.. తమ వినియోగదారుల కోసం ఉద్యోగులు సిద్ధం చేసే క్రియేటివిటీ అంశాల్ని కాపాడుకుంటున్నట్లుగా తమ చర్యల్ని సమర్థించుకోవటం గమనార్హం. తమపై వేసిన కేసులో పేర్కొన్న అంశాల్లో నిజం లేదంది. ఇదంతా చూస్తున్న వారు.. యాపిల్ అనుకున్నంత స్వీట్ కాదన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పోస్టు అవుతున్నాయి.

Tags:    

Similar News