సీ వ్యూ అని రూమ్ బుక్ చేసుకుంటే... 'బొమ్మ' చూపించారంట!

తాజాగా వెకేషన్ కోసం ఇంటలీకి వచ్చిన ఓ అర్జెంటీనా మహిళ కూడా ఓ హోటల్ బుక్ చేసుకున్నారు. ఈ సమయంలో ఆమె కూడా సీ వ్యూ రూం కావాలని కోరుకున్నారు.

Update: 2024-05-23 08:03 GMT

సాధారణంగా సముద్రం ఉండే ప్రాంతానికి వెకేషన్స్ కి వెళ్లినప్పుడు హోటల్ రుం బుక్కింగ్ విషయంలో చాలా మంది కోరే కోరిక... సీ వ్యూ రూం కావాలని! దానికి ఆ హోటల్ టారీఫ్ లో ప్రత్యేకమైన ధర ఉంటుంటుంది కూడా! అయినప్పటికి... ఉదయం లేచినప్పుడు, సాయంత్రం పూటా అలా బాల్కనీలో కూర్చుని సముద్రాన్ని చూస్తుంటే ఆ లెక్కే వేరని ప్రకృతి ప్రేమికులు, కళాపోషకులు భావిస్తుంటారు!

తాజాగా వెకేషన్ కోసం ఇంటలీకి వచ్చిన ఓ అర్జెంటీనా మహిళ కూడా ఓ హోటల్ బుక్ చేసుకున్నారు. ఈ సమయంలో ఆమె కూడా సీ వ్యూ రూం కావాలని కోరుకున్నారు. ఇందులో భాగంగా... ఉత్కంఠభరితమైన సముద్ర దృశ్యాలు ఉన్నాయని నమ్ముతున్న హోటల్ గది కోసం డబ్బు చెల్లించారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఎదురైన పరిణామం చూసి ఒక్కసారిగా ఆమె షాక్ కి గురయ్యారంట.

అవును... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ క్లారిసా ముర్గియా ఒక ప్రకటనలో చూసిన అద్భుతమైన సీ వ్యూ కారణంగా ఆ హోటల్ గదికి అదనపు డబ్బు ఖర్చు చేశారు. అయితే అది నకిలీ ఫోటో అని తెలుసుకుని షాక్ కి గురయ్యారంట. యూరప్‌ కు హాలిడే ట్రిప్ సందర్భంగా, అర్జెంటీనాకు చెందిన క్లారిసా హోటల్‌ లో చెక్ ఇన్ చేసి, నిజ జీవితంలోని అద్భుతమైన వీక్షణలను చూడటానికి తన గదికి వెళ్లింది.

అయితే.. ఆమె సూట్‌ లోకి ప్రవేశించినప్పుడు, ఆమె బాల్కనీకి ఎదురుగా ఉన్న భవనం గోడపై భారీ సముద్రతీర పోస్టర్ మాత్రం అతికించబడి ఉందంట. అంటే... అక్కడ సీ వ్యూ లేదు ఏమీ లేదు... కానీ వేరే గదుల్లో నుంచి ఉన్న సీవ్యూ కి సంబంధించిన పోస్టర్ ను మాత్రం ఈమె బుక్ చేసుకున్న గదిలో అంటించారన్నమాట. దీంతో... ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడానికి చేసిన చీప్ ట్రిక్ ఇది అంటూ ఆమె ఫైరవుతున్నారని తెలుస్తుంది.

ఈ సందర్భంగా ఆమెకు కేటాయించిన గదిలోని బాల్కనీలో ఒక కోణం నుండి పోస్టర్ నిజమైన బీచ్ లాగా ఎలా ఉందో ఆమె చూపించింది. ఇందులో అసలు దృశ్యం మరకలు, అడ్డుగా ఉన్న కిటికీల వరుసలతో కూలిపోతున్న తెల్లటి గోడగా ఉండగా.. దీనికి సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేసింది. ఈ సందర్భంగా "ఎక్స్‌పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ" అనే క్యాప్షన్‌ ను ఆమె పొందుపరిచింది.

Tags:    

Similar News